ETV Bharat / bharat

మీ ఇంట్లోనే ఐబ్రోస్ థ్రెడింగ్ - ఇలా ఈజీగా చేసుకోండి! - Own Eyebrows Threading at home

Eyebrows Threading at home : ఆడవాళ్ల అందంలో ఐబ్రోస్ పాత్ర ఎంతో కీలకం. వాటి షేప్​ చక్కగా ఉంటేనే.. ముఖం బ్యూటీఫుల్​గా కనిపిస్తుంది. ఇందుకోసం అందరూ పార్లర్​కు వెళ్తుంటారు. అయితే.. మేం చెప్పే చిట్కాలతో మీరే స్వయంగా ఇంట్లో థ్రెడింగ్ చేసుకోవచ్చు!

Eyebrows Threading at home
Eyebrows Threading at home
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 5:23 PM IST

Eyebrows Threading at home : మహిళల అందంలో ముఖంలోని ప్రతీ భాగమూ ముఖ్యమైనదే. ఇందులో కనుబొమ్మల పాత్ర మరింత కీలకం. పర్ఫెక్ట్ షేప్​లో ఉన్న ఐబ్రోస్​తో లుక్ అద్దిరిపోద్దంటే నమ్మాల్సిందే. అందుకే.. ఎక్స్​ట్రా ఉన్న వెంట్రుకలను తొలగించుకునేందుకు తరచూ పార్లర్‌కు వెళ్తుంటారు. చక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు.. వారిని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

అయితే.. ఈ ఉరుకుల పరుగుల షెడ్యూల్​లో బ్యూటీ పార్లర్​కు గంటలకొద్దీ సమయం కేటాయించడం చాలా మందికి కుదరదు. అంతేకాకుండా.. అన్ని బ్యూటీ సెలూన్లూ బడ్జెట్ అనుకూలమైనవి కావు. అందుకే.. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే.. ఇంట్లోనే మీరే స్వయంగా ఐబ్రోస్ థ్రెడింగ్ చేసుకోండి. అది ఎలాగో మేం నేర్పిస్తాం. ఇందుకోసం సింపుల్ చిట్కాలు ఇస్తున్నాం.

అప్పర్ లిప్​పై ప్రాక్టీస్ చేయండి..

మాగ్జిమమ్ జనాలు బ్యూటీ పార్లర్​కే వెళ్తారు కాబట్టి.. వారికి స్వయంగా థ్రెడింగ్ చేసుకోవడం రాదు. అది కొంచెం కష్టమైన పని కూడా. అయితే.. మీరు ఇంట్లో చేసుకోవాలని అనుకుంటే.. నేరుగా కనుబొమ్మలపైనే ప్రయోగం చేయకూడదు. షేప్ దెబ్బతింటే ఫీలవ్వాల్సి వస్తుంది. మళ్లీ వెంట్రుకలు పెరిగే వరకు ఆగాలి. కాబట్టి.. మీ పై పెదవి మీద ప్రాక్టీస్ చేయండి. థ్రెడింగ్ ద్వారా హెయిర్ ఎలా రిమూవ్ చేస్తారో.. ఆ విధంగా మీరు అప్పర్ లిప్​ మీద ప్రాక్టీస్ చేయండి. తద్వారా.. మీకు ప్రాక్టీస్ అవుతుంది.

థ్రెడ్ పర్ఫెక్ట్​గా ఉండాలి..

పని ఏదైనా సక్సెస్ కావాలంటే.. ముందుగా పనిముట్టు పక్కాగా ఉండాలి. ఇది ఐబ్రోస్​కు సైతం వర్తిస్తుంది. మీరు థ్రెడింగ్ చేసుకోవడానికి చక్కటి థ్రెడ్ కావాలి. చాలా మందికి ఎలాంటి థ్రెడ్ అవసరమో తెలియదు. మార్కెట్లో అందుబాటులో ఉండే పలు రకాల థ్రెడ్‌ల మధ్య మంచిది ఏదో గుర్తించలేరు. ఏదో ఒకటి పట్టుకొస్తారు. కానీ.. మందపాటి థ్రెడ్‌ తీసుకోకూడదు. ఇది థ్రెడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి కూడా కలుగుతుంది. అందువల్ల.. ఎల్లప్పుడూ సన్నటి దారాన్ని మాత్రమే కొనాలని గుర్తుంచుకోండి.

మేకప్ వేసుకోవద్దు..

థ్రెడింగ్ చేయడానికి ముందు మేకప్ వేసుకోకూడదు. మీరు మేకప్ వేసుకున్నప్పుడు థ్రెడ్ చేస్తే.. ఇబ్బంది అవుతుంది. మేకప్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. నొప్పి కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాదు.. మేకప్‌ తో థ్రెడింగ్ చేయడం.. ఆ క్రీమ్ హెయిర్ కుదుళ్లలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల ఐబ్రోస్ థ్రెడ్ పూర్తయిన తర్వాతనే మేకప్ వేసుకోవాలి.

ట్వీజింగ్..

థ్రెడింగ్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపించినా.. షేప్​ తేడా ఉన్నట్టుగా అనిపించినా ట్వీజింగ్ చేయండి. అంటే.. మార్కెట్లో చిన్న పట్టుకారు దొరుకుతుంది. దాంతో.. బయట కనిపించే వెంట్రుకలను తీసేయడాన్ని ట్వీజింగ్ అంటారు. ఇలా చేసుకుంటే.. పెద్దగా ఇబ్బంది లేకుండా ఐబ్రోస్ షేప్ సెట్ చేసుకోవచ్చు.

పూర్తయిన తర్వాత..

మీరు మీ ఐబ్రోస్ థ్రెడ్ చేయడం పూర్తయిన తర్వాత.. మీ కనుబొమ్మల చుట్టూ చిన్న చిన్న ర్యాషెష్ లాగా కనిపించొచ్చు. ఇవేమీ హానిచేయవు. కానీ.. చూడ్డానికి అంతగా బాగుండదు. కాబట్టి.. వాటిని త్వరగా తొలగించుకోవడానికి.. ఐస్ క్యూబ్‌లను ఒక శుభ్రమైన క్లాత్​లో చుట్టి, వాటిపై అప్లై చేస్తే సరిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.