ETV Bharat / bharat

బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!

Evaluation Of ECI From Ballot To EVM Machine : 18లో లోక్​సభ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీల గురించి చర్చలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలన లాంటి పనుల్లో ఈసీ బిజీగా ఉంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో గత 75 ఏళ్ల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించడం ఎప్పటినుంచి మొదలైంది అనే విషయాలు మీ కోసం.

Evaluation Of ECI From Ballot To EVM Machine

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 4:31 PM IST

Evaluation Of ECI From Ballot To EVM Machine : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఎన్నికల వ్యవస్థ అతి ముఖ్యమైనది. 1950 జనవరి 25న ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ ప్రస్థానంలో బ్యాలెట్​ పేపర్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్​లు ఇలా ఎన్నో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. కాలానుగుణంగా ఎన్నికల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది ఈసీ. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నికల విధానంలో వచ్చిన మార్పులు ఏంటి? ఎన్నికల్లో ఈవీఎంలు ఎప్పటి నుంచి వాడటం మొదలైంది తదితర విషయాలు మీ కోసం.

ఎలక్షన్ కమిషన్ ప్రయాణం సాగిందిలా

  • బంగాల్ చీఫ్‌ సెక్రటరీగా విధులు నిర్వహించిన అప్పటి ఐసీఎస్‌ అధికారి సుకుమార్‌ సేన్‌ కేంద్ర తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం ఏర్పాటైన దాదాపు రెండు నెలల తర్వాత 1950 మార్చి 21న ఆయన సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1951-51, 1957లో జరిగిన తొలి రెండు లోక్​సభ ఎన్నికలను సుకుమార్​ సేన్​ పర్యవేక్షించారు. భారత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సుకుమార్‌ సేన్‌ చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఉన్న విధివిధానాల్లో 80శాతం ఆయన తీసుకొచ్చినవే.
  • 1951-52లో 489స్థానాలకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్టీల్‌ బ్యాలెట్‌ బాక్సులను వినియోగించారు.
  • 70వ దశాబ్దం చివర్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలను) రూపొందించారు. 1999లో కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు వాటిని విస్తరించారు.
  • 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో 10లక్షలకు పైగా ఈవీఎంలను వినియోగించారు.
  • తొలి ఎన్నికల నుంచే ఎన్నికల గుర్తులను తీసుకొచ్చారు. 1951-52 కాలంలో ఎన్నికల్లో గుర్తుల కోసం ఎన్నికల కమిషన్ ఎంఎస్‌ సేథి అనే ఆర్టిస్ట్‌ను నియమించింది. రోజువారీ పనుల్లో ఉపయోగించే వస్తువులైతే ఓటర్లు సులువుగా గుర్తుపట్టగలని, అంతేకాకుండా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరని ఆయన ఎన్నికల కమిషన్ అధికారులకు తెలిపారు. ఇందుకోసం పెన్సిల్‌తో స్కెచ్‌లు వేశారు.
  • దేశవ్యాప్తంగా జరిగిన తొలి ఎన్నికల్లో 27,527 పోలింగ్ సెంటర్లను మహిళలకు రిజర్వ్​ చేశారు. ఆ తర్వాత కాలంలో దివ్యాంగులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీల్​ఛైర్ సౌకర్యం, అంధులకోసం బ్రెయిలీ ఓటర్ స్లిప్​లు, బ్రెయిలీ లిపిలో ఉండే ఈవీఎంలు లాంటి సదుపాయలను అందుబాటులోకి తెచ్చారు.
  • కేంద్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి టీఎన్​ శేషన్ హయంలో తొలిసారిగా 1993లో ఓటరు ఐడీలను జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలి నాళ్లలో సాధారణ పేపర్‌పై నల్ల సిరాతో ఓటర్‌ ఐడీలను ప్రింట్‌ చేసి లామినేట్‌ చేసేవారు. ఆ తర్వాత కాలంలో అంటే 2015 నుంచి కలర్‌ వెర్షన్‌లో డిజిటలైజ్డ్‌ ఫొటోతో ఈ ఓటర్​ఐడీలను జారీ చేస్తున్నారు.
  • ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం ఈసీ 2013లో ఓటర్​ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం ఎన్నికల నిర్వహణ నిబంధనల చట్టం-1961లో కొన్ని సవరణలు చేశారు.
  • 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి నోటా ఓటు ఆప్షన్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
  • తొలి లోక్​సభ ఎన్నికల్లో 17.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 నాటికి ఆ సంఖ్య 91.19 కోట్లకు పెరిగింది. గత లోక్​సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • ప్రస్తుతం దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. మార్చి రెండోవారం తర్వాత షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది.

దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్​లోకి 2 కోట్ల మంది యువత

'సెల్ఫీతో ఓటు.. పోలింగ్ కేంద్రాల్లో ఇక నో వెయిటింగ్'​.. కర్ణాటక ఎన్నికల్లో ఈసీ నయా టెక్నాలజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.