ETV Bharat / bharat

ప్రాంతీయ పార్టీలకు రూ.5వేల కోట్ల విరాళాలు- బీజేపీ కన్నా రూ.839 కోట్లే తక్కువ! - Regional Parties gains from bonds

Electoral Bonds Regional Parties : ఎలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచిన ఎన్నికల బాండ్ల వివరాల ప్రకారం దేశంలోని ప్రాంతీయ పార్టీలకు భారీగానే లబ్ధి చేకూరింది. బీజేపీ తర్వాత ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ విరాళాలు వచ్చాయి. మరి ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చాయో తెలుసా?

Electoral Bonds Regional Parties
Electoral Bonds Regional Parties
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 5:25 PM IST

Electoral Bonds Regional Parties : ఎన్నికల సంఘం తన వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల ప్రకారం దేశంలో ప్రాంతీయ పార్టీలకు కూడా భారీగానే లబ్ధి చేకూరినట్లు స్పష్టమవుతోంది. 2019 ఏప్రిల్‌- 2024 జనవరి మధ్య ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ప్రాంతీయ పార్టీలు రూ. 5,221 కోట్లకుపైగా విరాళాలు అందుకున్నాయి. బీజేపీకి రూ.6,061 కోట్ల విరాళాలు రాగా ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలకే ఎక్కువగా విరాళాలు అందాయి.

భారతీయ జనతా పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ.839 కోట్లు మాత్రమే తక్కువ కావడం గమనార్హం. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు 1,422 కోట్ల విరాళాలు రాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేవలం రూ. 65.45 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయ పార్టీలు, బీఎస్పీ, సీపీఎం, ఎన్‌పీపీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎటువంటి నిధులను పొందలేదు.

ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకే ఎక్కువ
ప్రాంతీయ పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా రూ.1,609.53 కోట్లు సమీకరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీఎంసీకి వచ్చిన విరాళాలు 22 ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో 30 శాతం ఉండడం విశేషం. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్​ఎస్​కు రూ.1,214.70 కోట్లు, బిజు జనతా దళ్​కు రూ.775.50 కోట్లు, డీఎంకేకు రూ.639 కోట్లు, వైసీపీకి రూ.337 కోట్లు, టీడీపీకి రూ.218.88 కోట్లు, శివసేనకు 159.38 కోట్లు విరాళాలుగా అందాయి. మిగతా పార్టీలు ఎంత సమీకరించాయంటే?

ప్రాంతీయ పార్టీ పేరుఅందిన విరాళాలు
ఆర్జేడీరూ.73.5 కోట్లు
జేడీఎస్‌రూ.43.40 కోట్లు
సిక్కిం క్రాంతికారీ పార్టీరూ.36.5 కోట్లు
ఎన్సీపీరూ.31 కోట్లు
జనసేనరూ.21 కోట్లు
జేడీయూరూ.14 కోట్లు
జేఎంఎంరూ.13.5 కోట్లు
ఏఐఏడీఎంకేరూ.6.05 కోట్లు
సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్రూ.5.5 కోట్లు

మూడు పార్టీలకు కోటి కన్నా తక్కువే
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, గోవా ఫార్వర్డ్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోటి రూపాయల కంటే తక్కువ విరాళాలు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 2018 మార్చి నుంచి 2024 జనవరి వరకు రూ.16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను విక్రయించారు.

మొత్తం బాండ్లలో 54.77 శాతం బీజేపీకే
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అత్యధికంగా రూ. 6,566 కోట్లతో మొత్తం బాండ్లలో 54.77 శాతం విరాళాలను అందుకుంది. కాంగ్రెస్ రూ.1,123 కోట్లతో 9.37 శాతం, తృణమూల్ కాంగ్రెస్ రూ. 1,092 కోట్లతో 9.11 శాతం విరాళాలను అందుకున్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 మధ్యకాలంలో దాతలు మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు.

వాటిలో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు విత్‌ డ్రా చేసుకున్నాయని ఎస్‌బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో గురువారం పొందుపరిచింది. వెబ్‌సైట్‌లో ఉంచిన మొత్తం 337 పేజీల డేటాలో రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది.

'26రోజులుగా ఏం చేశారు?'- SBIపై సుప్రీం ఫైర్- ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చాలని స్పష్టం

ఏంటీ ఎన్నికల బాండ్లు? ఎందుకు రాజ్యాంగ విరుద్ధం? ప్రజాస్వామ్యానికి అంత నష్టమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.