ETV Bharat / bharat

'ఆడియో రికార్డింగ్స్ డిలీట్ చేశారు'- ఈడీపై ఆప్ సంచలన ఆరోపణలు- దర్యాప్తు సంస్థ ఫైర్ - దిల్లీ ఆతిశీ ఈడీ

ED Audio Clip Delete Athishi : ఈడీపై దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. దర్యాప్తు సమయంలో సాక్షుల నుంచి సేకరించిన ఆడియో క్లిప్​లను ఈడీ డిలీట్​ చేసిందని ఆరోపించారు. ఎవరిని కాపాడటానికి ఈడీ ఈ పని చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను ఈడీ తిప్పికొట్టింది. మంత్రిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ED Audio Clip Delete Athishi
ED Audio Clip Delete Athishi
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 5:13 PM IST

Updated : Feb 6, 2024, 5:22 PM IST

ED Audio Clip Delete Athishi : గత ఏడాది కాలం నుంచి దర్యాప్తులో భాగంగా రికార్డు చేసిన సాక్షుల ఆడియో క్లిప్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్​ డైరెక్టరేట్​(ED) డిలీట్​ చేసిందని దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇది కుంభకోణం కేసులో దర్యాప్తు కాదని, ఈడీ చేస్తున్న దర్యాప్తే ఒక స్కామ్​ అని ఘాటుగా విమర్శించారు. ఆడియో ఫైళ్లను డిలీట్​ చేసి ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అని ఈడీని ప్రశ్నించారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సాక్షులు, నిందితులను బెదిరించి బలవంతంగా వాంగ్మూలాలు సేకరించినట్లు ఆతిశీ ఆరోపించారు. రెండేళ్ల నుంచి ఆప్‌ నేతలను బెదిరిస్తోందన్నారు. మద్యం కుంభకోణం పేరుతో తమ పార్టీ నేత ఒకరి ఇంటిపై దాడులు, మరొకరికి సమన్లు పంపటం, ఇంకొకరిని అరెస్ట్‌ చేయటం జరుగుతోందన్నారు. రెండేళ్లలో వందసార్లకుపైగా ఈడీ సోదాలు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయిందని చెప్పారు. ఆధారాలు సమర్పించాలని కోర్టు పదేపదే సూచిస్తున్నా ఈడీ కనీసం ఆధారాలు కూడా సేకరించలేకపోయిందన్నారు.

ఆప్‌ నేతలతోపాటు తమ పార్టీతో సంబంధమున్న వారిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయని అతిషి ఆరోపించారు. ఆప్‌ ఎంపీ ఎన్​డీ గుప్తా, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌కుమార్‌ సహా, పార్టీకి చెందిన పలువురి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్ధల సాయంతో ఆప్‌ను అణిచివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పదలచుకున్నట్లు దిల్లీ మంత్రి అతిషి చెప్పారు.

ఈడీ రియాక్షన్
ఆతిశీ చేసిన ఆరోపణలను ఈడీ తిప్పికొట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థపై ఇలాంటి ఆరోపణలు చేసిన సదరు మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక దర్యాప్తులో భాగంగా నిందితులను విచారిస్తున్న సమయంలో ఉన్న సీసీటీవీ సిస్టమ్​లో ఆడియో రికార్డింగ్​ సౌకర్యం లేదని, అప్పుడు వీడియో ఓన్లీ ఫార్మాట్​లో వీడియో రికార్డ్ అయిందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈడీ జరిపిన విచారణ ప్రక్రియ వీడియో క్యాప్చరింగ్ సిస్టమ్​కు గత ఏడాది అక్టోబర్​లోనే ఆడియో రికార్డింగ్​లను జోడించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డు! లీకేజీలకు భారీ శిక్ష- కేంద్రం కొత్త చట్టంపై ఉద్యోగార్థుల హర్షం

ఈడీ అధికారుల్లా నటించారు- రూ.1.69 కోట్లు కాజేశారు- చివరకు ఏమైందంటే?

Last Updated : Feb 6, 2024, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.