Tips To Remove Oil Stains From Clothes : తినేటప్పుడైనా లేదంటే ఏదైనా పనిచేసేటప్పుడైనా దుస్తులపై వివిధ రకాల పడడం సహజం. అయితే, వాటిలో కొన్ని రకాల మరకలు సులభంగా వదిలిపోతే.. 'నూనె మరకలు' తొలగించడం మాత్రం కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది వాటిని పోగొట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఇకపై మీరు ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదు! ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా బట్టలపై పడిన నూనె మరకలను(Stains) తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బేబీ పౌడర్ : దుస్తులపై పడిన నూనె మరకలు పోగొట్టడంలో ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్లో బేబీ పౌడర్, డిష్ సోప్‌ని సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని మరకలు ఉన్న చోట అప్లై చేయాలి. అలా గంటసేపు ఉంచి ఆ తర్వాత రుద్ది వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
చాక్‌పీస్ : దీనితో కూడా బట్టలపై పడిన నూనె మరకలను సులభంగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. చాక్పీస్ను తీసుకొని మరకలు ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. చాక్‌పీస్ నూనెను పీల్చేసుకోవడం వల్ల మరక ఈజీగా వదలిపోతుందని చెబుతున్నారు.
పెరుగు : నూలు దుస్తులపై పడిన నూనె మరకల్ని తొలగించడంలో పెరుగు చాలా బాగా సహాయడుతుందంటున్నారు. ఒక చిన్న బౌల్లో కాస్త పెరుగు తీసుకొని బట్టలపై మరక పడిన చోట రుద్ది కాసేపయ్యాక వాష్ చేసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
గ్లిజరిన్ : దుస్తులపై లిప్‌స్టిక్, నూనె మరకలు పడితే ఆ ప్రదేశంలో కొద్దిగా గ్లిజరిన్ రాసి ఒక అరగంట తర్వాత వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటన్నారు నిపుణులు. ఈజీగా మరకలు వదిలి దుస్తులు కొత్తవాటిలా కనిపిస్తాయని చెబుతున్నారు!
వాట్ ఆన్ ఐడియా : షర్ట్ మీద చట్నీ- కుర్తామీద కాఫీ - మరక ఎంత మొండిదైనా మటాషే!
బట్టలపై నూనె మరకలే కాదు కొన్నిసార్లు మార్కర్, తుప్పు, టీ మరకలు పడుతుంటాయి. కానీ, వాష్ చేస్తే అవి అంత సులభంగా పోవు. ఆ టైమ్‌లో ఇలా చేశారంటే ఆ మరకలను ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు.
సన్‌స్క్రీన్ : కొన్నిసార్లు దుస్తులు, రగ్గులపై మార్కర్ మరకలు పడుతుంటాయి. అలా పడినప్పుడు ఆయా ప్రదేశాల్లో కాస్త సన్‌స్క్రీన్ అప్లై చేయండి. ఆపై అరగంట ఆగి పొడి క్లాత్‌తో తుడిచేస్తే బెటర్ రిజల్ట్ కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ : బట్టలపై తుప్పు మరకలు పడితే.. వీటిని తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. మరకలున్న చోట కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి అప్లై చేయాలి. ఆ తర్వాత బట్టలను ఉతికితే మరకలు సింపుల్‌గా తొలగిపోతాయంటున్నారు.
బేకింగ్ సోడా : చాలా మంది దుస్తులపై పడిన టీ(Tea) మరకల్ని తొలగించడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే, బేకింగ్ సోడాను ఉపయోగించి ఈ మరకలను ఈజీగా వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం చెంచా బేకింగ్ సోడా తీసుకొని టీ మరకలు పడిన చోట వేసి నెమ్మదిగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత దుస్తుల్ని వాష్ చేస్తే సరిపోతుంది.
2011లో "జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. టీ మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లాండ్రీ టెక్నాలజీ విభాగానికి చెందిన 'డాక్టర్ మార్గరెట్ జాన్సన్' పాల్గొన్నారు. టీ మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా బాగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
సూపర్ ఐడియా: దిండ్లపై మరకలు పోవడం లేదా ? ఈ టిప్స్ పాటిస్తే చిటికెలో మాయం!