ETV Bharat / bharat

సమ్మర్ స్పెషల్ : నోరూరించే మునక్కాయ బిర్యానీ - ఇలా ప్రిపేర్​ చేయండి - కుమ్మేస్తారంతే! - Drumstick Biryani Recipe - DRUMSTICK BIRYANI RECIPE

Drumstick Biryani Recipe : బిర్యానీ అంటే ఇష్టమా? సమ్మర్​లో నాన్​వెజ్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని బాధపడుతున్నారా? అయితే టెన్షన్​ అక్కర్లేదు. మీకోసం అదిరిపోయే మునక్కాయ బిర్యానీ తీసుకొచ్చాం. దీనిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. సమ్మర్​లో ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు! మరి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా?

Drumstick Biryani
Drumstick Biryani Recipe
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 5:00 PM IST

How to Prepare Drumstick Biryani : మనలో చాలా మంది బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బిర్యానీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రకరకాల రుచుల్లో దొరికే బిర్యానీలను బయటి నుంచి కొని తెచ్చుకొని మరీ టేస్ట్ చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం సమ్మర్​ సీజన్ కావడంతో కొంతమంది నాన్​వెజ్​కు దూరంగా ఉండాలనుకుంటారు. కానీ, బిర్యానీ(Biryani) తినాలనే కోరిక మాత్రం ఊరిస్తోంది. అలాంటి వారికోసం అదిరిపోయే వెజ్ బిర్యానీ తీసుకొచ్చాం. అదే.. మునక్కాయ బిర్యానీ. దీనిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం. పైగా సమ్మర్​లో మునక్కాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌ నుంచి కాపాడడంతో పాటు.. అలసట, వడదెబ్బ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాదు.. మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇంకెందుకు ఆలస్యం సమ్మర్​లో మీరు కూడా ఓసారి మునక్కాయ బిర్యానీ ట్రై చేయండి!

కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి రైస్ - 400 గ్రాములు
  • మునక్కాయలు - 5
  • పచ్చి బఠానీలు - అరకప్పు
  • బిర్యానీ ఆకులు - 4
  • పచ్చిమిర్చి - 6
  • ఉల్లిపాయలు - 4
  • టమాటాలు - 3(నార్మల్​ సైజ్​వి)
  • లవంగాలు - 8
  • యాలకులు - 4
  • దాల్చిన చెక్క ముక్కలు - 2
  • కారం పొడి - 1 టేబుల్ స్పూన్
  • కసూరి మేతి - 1 టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 టేబుల్ స్పూన్
  • బిర్యానీ మసాలా - అర టీస్పూన్
  • నూనె - తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పెరుగు, పుదీనా, కొత్తిమీర తరుగు - కొద్దిగా.

మార్కెట్లోకి మ్యాంగో వచ్చింది - వంటింట్లో జిలేబీ, పులావ్ ప్రిపేర్ చేయండి - కుమ్మేస్తారంతే!

మునక్కాయ బిర్యానీ తయారీ విధానం :

  • ముందుగా మునక్కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరుక్కోవాలి. అలాగే బాస్మతి రైస్​ను కాసేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. అది కాస్త వేడి అయ్యాక తరిగిన లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత దానికి పుదీనా, కొద్దిగా కొత్తిమీర తరుగు, కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమంలో కట్​చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
  • తర్వాత టమాట ముక్కలు, పచ్చి బఠానీలు, పెరుగు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
  • ఆ తర్వాత కారం, బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా కట్​ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొలత ప్రకారం బియ్యానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మూతపెట్టుకోవాలి.
  • నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఆపై మూతపెట్టుకోవాలి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్​ మీద ఉడికించుకోవాలి. బిర్యానీ రెడీ అయ్యింది అనుకున్నప్పుడు దానిపై కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి. అంతే.. నోరూరించే టెస్టీ మునక్కాయ బిర్యానీ సిద్ధం!

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు! - Easy Egg Snack Recipes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.