ETV Bharat / bharat

రూ.1100 కోట్ల విలువైన డ్రగ్స్​ సీజ్​- గోడౌన్లలో దాచిన 600కిలోలు స్వాధీనం - pune drugs seize

Drugs Seized In Pune : మహారాష్ట్రలోని పుణెలో రూ.1,100 కోట్ల విలువైన డ్రగ్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము జప్తు చేసిన మెఫిడ్రోన్ అనే డ్రగ్ దాదాపు 600 కిలోలు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

drugs seized in pune
drugs seized in pune
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 6:19 PM IST

Updated : Feb 20, 2024, 7:30 PM IST

Drugs Seized In Pune : మహారాష్ట్ర పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్ లభ్యమైంది. సుమారు రూ.1,100 కోట్ల విలువైన 600 కిలోల మెఫిడ్రోన్​ అనే డ్రగ్​ను పుణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్​ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైనోట్రోపిక్ సబ్​స్టాన్సెస్ యాక్ట్​( ఎన్​డీపీఎస్ యాక్ట్​)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

'ఆదివారం నుంచే ఈ ఆపరేషన్ చేపట్టాం. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి తొలుత రూ. 3.85 కోట్ల విలువైన మెఫిడ్రోన్​ను స్వాధీనం చేసుకున్నాం. ఈ క్రమంలో వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాం. మరో రెండు గోడౌన్లలో 55 కిలోల మెఫిడ్రోన్​ను జప్తు చేశాం. కుర్కుంభ్ MIDC ప్రాంతంలో మరొక ఆపరేషన్ నిర్వహించి 550 కిలోల డ్రగ్స్​ను రికవరీ చేశాం. ఇంకా ఈ ముఠా వెనుక ఎవరున్నారనే కీలక విషయాలను రాబడుతున్నాం. అరెస్టైన నిందితులు కొరియర్ బాయ్స్​గా చలామణి అవుతున్నారు. డ్రగ్స్ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పుణెను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రాధాన్యం' అని పుణె పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు.

Drugs Seized In Pune
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్

డ్రగ్స్ కేసులో యువకుడు అరెస్ట్
నవీ ముంబయిలో 7.5లక్షల రూపాయల విలువైన మెఫిడ్రోన్ డ్రగ్స్​ కలిగి ఉన్నాడనే కారణంతో ఓ యువకుడిని అరెస్ట్ చేసింది యాంటీ నార్కోటిక్స్ సెల్(ANC) బృందం. పక్కా సమాచారంతో నిందితుడి నుంచి డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? కస్టమర్లకు ఎలా సరఫరా చేస్తున్నాడనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్​
గతేడాది మేలో దేశ పశ్చిమ తీరంలోని భారీగా డ్రగ్స్ లభ్యమైంది. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ, ఎన్​సీబీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్న 2,500 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే నౌకలో ఉన్న పాకిస్థాన్​కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మరాఠాలకు 10శాతం రిజర్వేషన్ - బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక- తొలిసారి పెద్దల సభకు

Last Updated : Feb 20, 2024, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.