Driverless Metro In Bangalore : బెంగళూరు మెట్రో రైలు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను మరికొన్ని నెలల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఆరు కోచ్‌లు కలిగిన తొలి రైలు చైనా నుంచి బెంగళూరుకు చేరుకున్నట్లు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) వెల్లడించింది. ఈ కోచ్‌లను ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ సిటీలోని హెబ్బగోడి డిపోకు తరలించినట్లు తెలిపింది. ఎల్లో లైన్‌లో ఆర్‌వీ రోడ్డు నుంచి సిల్క్ బోర్డు మీదుగా ఎలక్ట్రానిక్ సిటీ వరకు ఈ ట్రైన్‌ను నడపనున్నారు.
'డ్రైవర్‌లెస్ మెట్రో రైలు, కోచ్‌లను చైనాకు చెందిన సంస్థ సమకూర్చింది. 216 కోచ్‌ల తయారీకి ఆ సంస్థతో బీఎంఆర్‌సీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 90 కోచ్‌లతో 15 రైళ్లు ఏర్పాటు చేసి ఎల్లో లైన్‌లో తిప్పుతాం. ప్రస్తుతం వచ్చింది నమూనా రైలు.' అని బీఎంఆర్‌సీఎల్ అధికారులు వివరించారు.
చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ నాన్జింగ్ పుజెన్ కో లిమిటెడ్ అనే సంస్థ 216 కోచ్‌లను సరఫరా చేసేందుకు రూ.1578 కోట్ల కాంట్రాక్టును బీఎంఆర్‌సీఎల్ నుంచి 2019లో దక్కించుకుంది. ఇందులో భాగంగా నమూనా రైలు కోచ్‌లను జనవరి 24న చైనా నుంచి పంపగా ఫిబ్రవరి 6న చెన్నై నౌకాశ్రయానికి చేరుకున్నాయి. వివిధ రకాల టెస్ట్‌లు నిర్వహించి వాటి ఫలితాలను రైల్వే శాఖకు సమర్పించి సాంకేతిక అనుమతి కోరనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి దాదాపు ఐదు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లో లైన్‌పై ఇప్పటికే సివిల్, ట్రాక్ పనులు పూర్తయినప్పటికీ కోచ్‌లు అందుబాటులో లేనందున ట్రయల్ రన్ ప్రారంభం కాలేదు. ఆరు కోచ్‌లతో కూడిన నమూనా రైలును అమర్చిన తర్వాత 19.15 కి.మీల ఎల్లో లైన్‌లో ట్రయల్ రన్‌ను చేపట్టనున్నారు.
బుల్లెట్ ట్రైన్ వీడియో!
Bullet Train Project In India : గంటకు గరిష్ఠంగా 320 కి.మీల మెరుపు వేగం. రెండు గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం. నదులపై 24 వంతెనలు. కాగా, 'ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్'కు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఉన్న ఓ వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవలే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కేజ్రీవాల్‌కు ఆరోసారి ఈడీ సమన్లు- 19న విచారణకు రావాలని ఆదేశం
'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం