ETV Bharat / bharat

కారు సీటు బెల్ట్​పై 'బ్లాక్​ బటన్'​ ఎప్పుడైనా గమినించారా?.. అది ఎందుకో తెలుసా? - Car Seat Belts Secret Button - CAR SEAT BELTS SECRET BUTTON

Car Seat Belts Secret Button : కారులో ప్రయాణించేటప్పుడు కొన్ని ట్రాఫిక్ నియమాలను ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అందులో ఒకటి సీటు బెల్ట్ ధరించడం. అయితే.. మీరు సీటు బెల్ట్ ధరించే క్రమంలో దానిపై ఉన్న చిన్న బటన్​ను ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకు ఉంటుందో తెలుసా??

Car Seat Belts Black Button Importance
Car Seat Belts Secret Button (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 10:27 AM IST

Do You Know About Secret Button On Car Seat Belts? : ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి.. సీటు బెల్ట్(Seat Belt). దీనినే 'సేఫ్టీ బెల్ట్' అని కూడా పిలుస్తారు. కారు నడుపుతున్నప్పుడు లేదా వెహికల్​లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కచ్చితంగా సీటు​ బెల్ట్ ధరించాలి. ఈ నిబంధనను ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. లేదంటే ధరించని వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

అయితే.. సీటు బెల్ట్ ధరించడం వల్ల జరిమానా నుంచి తప్పించుకోవడమే కాదు.. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను రక్షించుకోవడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇది అందరికీ తెలుసు. కానీ, సీటు బెల్ట్ ధరించేటప్పుడు దానిపై బ్లాక్ కలర్​లో ఒక చిన్న బటన్ ఉంటుంది. ఎప్పుడైనా దానిని గమినించారా? అది ఎందుకు ఉంటుందనే ఆలోచన వచ్చిందా? అసలు.. ఇంతకీ, ఆ బటన్ సీటు బెల్ట్​పై ఎందుకు ఉంటుంది? దాని వల్ల కలిగే ఉపయోగం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సీటు బెల్ట్​పై చూడడానికి ఆ బటన్ చిన్నగానే కనిపించొచ్చు. కానీ, అది చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఆ బటన్ చేసే పని ఏంటంటే.. బెల్ట్ కట్టు వెనుకకు వెళ్లకుండా అది నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తుందంటున్నారు.

గుంతలు, స్పీడ్​ బ్రేకర్స్ నుంచి ఇలా బయటపడండి - రోడ్డు ప్రమాదాల్లేకుండా సేఫ్ జర్నీ!

సీటు బెల్ట్​పై కట్టు(బకిల్) ఉంటుంది. అప్పుడు సీటులో కూర్చున్న వ్యక్తి సీటు బెల్ట్‌ను పక్కకు లాగినప్పుడు, కట్టు సైడ్​లో ఉన్న గాడిలోకి వెళ్లి.. అక్కడ అది ఇరుక్కుపోతుంది. కానీ, కట్టు తీసినప్పుడు అది వదులుగా మారి బెల్ట్‌పైకి జారిపోతుంది. అయితే.. మళ్లీ సీటులో కూర్చున్నప్పుడు బకిల్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి, అలాంటి అసౌకర్యం కలిగించకుండా సీటు బెల్ట్​పై ఉండే.. ఈ చిన్న బటన్ బెల్ట్ కట్టు అటు ఇటూ పోకుండా ఒకే ప్లేస్​లో ఉండేలా అడ్డుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదే కాకుండా మీకు కారులో ప్రయోజనాలు అందించే మరికొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ప్రెటోల్ ట్యాంక్ ఇండికేటర్ దగ్గర ఉన్న చిన్న బాణం గుర్తు. ఇది పెట్రోల్ ట్యాంక్ దిశను సూచిస్తుంది. కారులో ఈ యారో గుర్తు ఎడమవైపు ఉంటే.. పెట్రోల్ ట్యాంక్ ఎడమ వైపున ఉన్నట్టు. అదే.. కుడి వైపు ఉంటే ట్యాంక్ రైట్ సైడ్ ఉంటుందని గమనించాలి.

కొత్త కారు కొంటున్నారా? ఈ 5 ఫీచర్స్​ ఉంటే ఫుల్​ కంఫర్ట్,​ సేఫ్​ జర్నీ! - Best Car Features

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.