ETV Bharat / bharat

బెంగళూరులో దారుణం- మహిళను చంపి, 30కిపైగా ముక్కలుగా నరికి, ప్రిడ్జ్​లో కుక్కి! - Woman Body Found In Fridge - WOMAN BODY FOUND IN FRIDGE

Woman Body Found In Fridge : శ్రద్ధావాకర్ తరహా మరో దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. దాదాపు 30 ముక్కలుగా నరికి మహిళ మృతదేహాన్ని ప్రిడ్జ్​లో కుక్కారు!

Woman Body Found In Fridge
Woman Body Found In Fridge (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 6:12 PM IST

Updated : Sep 21, 2024, 7:54 PM IST

Woman Body Found In Fridge : శ్రద్ధావాకర్​ హత్య తరహా మరో దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. 30కిపైగా ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతురాలిని మహాలక్షిగా గుర్తించినట్లు, ఆమె మృతదేహం ఛిద్రమైన స్థితిలో లభ్యమైనట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వయాలికావల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు మహాలక్షికి(29) ఇది వరకే పెళ్లైంది. వ్యక్తిగత కారణాలతో తన బిడ్డతో పాటు మునేశ్వరనగర్​లో ఐదు నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటోంది. తన భర్త హుకుమ్​ సింగ్​ నేలమంగళలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలికి, ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఫోన్​ చేశారు. ఫోన్​ స్విచ్ఛాఫ్​ కావడం వల్ల అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్​ లేబరేటరీ బృందం ఘటనాస్థలిని పరిశీలించారు.

అయితే కొద్దిరోజుల క్రితం మహిళ హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి ఫ్రిజ్​లో పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే బాధితురాలి ఫోన్​ సెప్టెంబర్​ 2న అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

"రీసెంట్​గా బాధితురాలు నాకు ఫ్రెండ్​ అయింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె అన్నయ్య ఆ ఇంట్లోనే కొన్నిరోజులు ఉన్నాడు. ఆయన పోయిన తర్వాత ఆమె ఒంటరిగానే ఇంట్లో ఉంటోంది. అయితే, పెళ్లైనట్లు హత్య జరిగిన తర్వాతే మాకు తెలిసింది. ఆమె ఇక్కడికి వచ్చి ఐదు నెలలైంది. రోజూ ఉదయం 9.30 గంటలకు బయటకు వెళ్లి, రాత్రి 10.30 గంటలకు ఇంటికి వచ్చేది. ఇటీవల ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రిడ్జ్​ ఓపెన్​ చేయగానే బాధితురాలి తల్లి, సోదరి గట్టిగా అరిచారు. ఏమైంది అని అడిగితే, అందులో ముక్కలుగా కట్​ చేసిన మృతదేహం ఉందని చెప్పారు" అని స్థానికురాలు మేరీ చెప్పింది.

'శ్రద్ధావాకర్​ను అందుకే ఆఫ్తాబ్‌ చంపేశాడు'.. 6వేల పేజీల ఛార్జ్​షీట్​లో కీలక విషయాలు

ఆ ఎముకలు శ్రద్ధావే.. DNA నివేదికలో వెల్లడి.. త్వరలో హత్య సీన్​ రీక్రియేట్​!

Last Updated : Sep 21, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.