Delhi Heavy Rainfall : దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు దిల్లీలోని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 88 ఏళ్లలో జూన్ నెలలో ఓ రోజు అత్యధికంగా వర్షం కురవడం ఇదే తొలిసారి. 1936 జూన్ 24న దిల్లీలో 235.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు కారణంగా వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటనలో ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మరణించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది. భారీగా వరద నీరు రావడం వల్ల ఎయిమ్స్‌లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
#WATCH | Latest visuals from the spot where a rescue operation is underway by NDRF, fire brigade and police officials after three labourers fell into a pit of an under-construction building in Delhi's Vasant Vihar area. https://t.co/NWZ60wugEt pic.twitter.com/Hu0rwPWSl0
— ANI (@ANI) June 28, 2024
దిల్లీలోని వసంత్ విహార్ వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి మృతదేహాలను శనివారం వెలికితీశారు. న్యూ ఉస్మాన్‌పుర్‌లో వర్షపు నీరు నిండిన కాలువలో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఓ అండర్‌పాస్ వద్ద వరద నీటిలో మునిగి 20 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి లైవ్ వైర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. దిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైభాగం కూలి క్యాబ్ డ్రైవర్ మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద గోడ కూలి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
#WATCH | Delhi: The body of one of the three labourers who fell into a pit of an under-construction building in Vasant Vihar yesterday, being taken out by the NDRF team.
— ANI (@ANI) June 29, 2024
Search and rescue operation for the other two labourers underway. https://t.co/btvT7soLs3 pic.twitter.com/gfWiXFJ7fv
#WATCH | 3 children died after the wall of an under-construction house collapsed in the Greater Noida's Surajpur Police station area. pic.twitter.com/sIuvZzDFc8
— ANI (@ANI) June 28, 2024
సమీక్షించిన మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇక దిల్లీ విమానాశ్రయం ఘటనలో గాయపడి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అన్ని విభాగాల అధికారులతో మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో నిర్మాణాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అయిదు రోజుల్లోపు నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అప్రమత్తమైన దిల్లీ సర్కారు పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది.
#WATCH | Delhi: On the canopy collapse incident at Delhi airport T-1, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, " sadly, a life was lost in the incident...we will be giving rs 20 lakhs ex-gratia to the family of the victim, all injured will get rs 3 lakhs… pic.twitter.com/ypuG4TwEye
— ANI (@ANI) June 29, 2024
రోడ్లపై వరద నీరు
ఇక వర్షాలు కారణంగా రోడ్లపై వరద నీరు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రగతి మైదాన్‌తోపాటు పలుచోట్ల కీలక ప్రాంతాల్లో ఉన్న సొరంగ మార్గాలను మూసివేశారు. దిల్లీ రైల్వేస్టేషనులో, పలు మెట్రోస్టేషన్ల వద్ద వరదనీరు చేరింది. నగరంలో చాలాచోట్ల విద్యుత్తు లైన్లు, స్తంభాలు కూలిపోయాయి. ముందు జాగ్రత్తగా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆజాద్‌పుర్ వంతెన కింద చిక్కుకుపోయిన ఓ బస్సు నుంచి 21 మంది ప్రయాణికులను అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడారు. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్ పరిసరాల్లో గురువారం నుంచీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన వేడి వాతావరణం తర్వాత ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు దిల్లీలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
#WATCH | Visuals from outside the residence of Delhi Water Minister Atishi. The area around her residence is inundated following heavy rainfall. pic.twitter.com/GCs9ec4VpW
— ANI (@ANI) June 28, 2024
మమతా బెనర్జీపై గవర్నర్ బోస్ పరువు నష్టం కేసు- అలా అన్నందుకే!
UGC NET పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన NTA- ఈసారి ఆన్లైన్లో ఎగ్జామ్! - UGC NET Exam