ETV Bharat / bharat

హెచ్చరిక : పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే! - PM Kisan Scam 17th Installment - PM KISAN SCAM 17TH INSTALLMENT

PM Kisan Scam 17th Installment : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. లబ్ధిదారులు 9 కోట్ల మందికిపైగా ఉండడంతో.. కాస్తముందూ వెనకా డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నాయి. అయితే.. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు.. ఈ సొమ్ముతోపాటు బ్యాంకు ఖాతాల్లోని మిగిలిన డబ్బునూ లూటీ చేస్తున్నారు.

PM Kisan Scam 17th Installment
PM Kisan Scam 17th Installment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 7:15 AM IST

PM Kisan Scam : పీఎం కిసాన్ పథకం ద్వారా సుమారు 9.3 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. వీరందరికీ 17వ విడత చెల్లింపులు చేసేందుకు.. కేంద్రం దాదాపు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. చాలా మంది బ్యాంకు అకౌంట్లలో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కానీ.. కొందరికి ఇంకా జమ కాలేదు. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు! "మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి" అంటూ మోసపు లింకులు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నవారు దానిపై క్లిక్ చేస్తూ సర్వం పోగొట్టుకుంటున్నారు.

కుమురంభీం జిల్లాలో..

తాజాగా కుమురంభీం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోని దహెగాం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తనకు వచ్చిన ఇలాంటి లింక్​పై క్లిక్ చేశాడు. అంతే.. వెంటనే తన అకౌంట్లోని రూ.98 వేలు మాయమైపోయాయి. అంతే కాదు.. అతని ఫోన్‌ నంబర్, ఆధార్‌ కార్డు కూడా పని చేయకుండా పోయాయి. కాబట్టి.. ఇలాంటి అపరిచిత వ్యక్తులు పంపించే లింకులుపై క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. ఎక్కడో ఒకచోట మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

పీఎం కిసాన్ డబ్బులు రాలేదంటే..

ఎవరికైనా పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ కాలేదంటే.. వారు కేవైసీ పూర్తిచేయకపోవడమే కారణం కావొచ్చు. దీన్ని నిర్ధారించుకోవడానికి ఈ పద్ధతి అనుసరించండి. ముందుగా..

www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.

తర్వాత వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ స్టేట్‌, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.

అలాగే లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి.

మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్​ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్​ ఇలా తెలుసుకోండి.

స్టేటస్ చెకింగ్ ఇలా..

పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.

ఇప్పుడు "Know Your Status" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్​ నమోదు చేయాలి.

ఆ తర్వాత "Get Data" అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని అర్థం.

పీఎం-కిసాన్ నిధి ప్రయోజనం పొందుతున్న రైతులు.. ప్రస్తుతం విడుదలైన 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటు ఆ తర్వాతి పేమెంట్లను పొందాలంటే ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. కేవైసీని రెండు మార్గాల్లో పూర్తి చేయవచ్చు.

ఓటీపీ విధానంలో ఈ-కేవైసీ..

పీఎం-కిసాన్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. (https://pmkisan.gov.in/)

Farmers Corner సెక్షన్ కింద ఉండే ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ రిజిస్టర్ చేసుకోవాలి.

మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ

లబ్దిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రాష్ట్ర సేవా కేంద్రానికి వెళ్లాలి.

ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ చెప్పాల్సి ఉంటుంది

సీఎస్‌సీ ఆపరేటర్.. లబ్దిదారుల వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్‌ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్‌ పూర్తి చేస్తారు.

ఈ విధంగా రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా పీఎం-కిసాన్ నిధి ప్రయోజనాలను పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.