ETV Bharat / bharat

మైనర్​ మరదలిపై అత్యాచారం - గర్భం దాల్చిన బాలికతో యాసిడ్ తాగించిన నిందితుడు! - SISTER PREGNANT BY COUSIN BROTHER

గర్భం దాల్చిన మైనర్ బాలిక- మరదలికి యాసిడ్ తాగించిన నిందితుడి కుటుంబ సభ్యులు- బాలిక పరిస్థితి విషమం - నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Sister Pregnant By Cousin Brother
Sister Pregnant By Cousin Brother (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 1:18 PM IST

Sister Pregnant By Cousin Brother In Moradabad : ఓ యువకుడు తన సొంత మైనర్​ మరదలిపై అత్యాచారానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. అబార్షన్​ కోసం గర్భనిరోధక మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోవడం వల్ల, చివరకు ఆ యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి మైనర్​కు యాసిడ్​ తాగించారు. దీంతో ఆమె పరిస్థితి విషమించగా, నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మొరాదాబాద్​ జిల్లాకు చెందిన జావేద్​ అనే యువకుడు ఎనిమిది నెలల క్రితం తన మామ వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన మైనర్​ మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. అదే విషయాన్ని యువకుడికి చెప్పగా, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. అయినా మైనర్​కు అబార్షన్​ కాలేదు. దీంతో గర్భాన్ని తొలగించడానికి యువకుడు, తన తల్లి కలిసి అతడి సోదరుడికి యాసిడ్​ బాటిల్​ ఇచ్చి మైనర్​కు పంపించారు. అది అబార్షన్​ కోసం తీసుకొచ్చిన మందు అని చెప్పి నమ్మించారు. దీంతో యాసిడ్​ తాగిన బాధితురాలి పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న మైనర్​ను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు జరిగిందంతా కుటుంబ సభ్యలకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి యువకుడు, అతడి తల్లి, సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి మరింత విషమించడం వల్ల వైద్యులు దిల్లీకి తరలించారు.

పోర్న్ వీడియోలకు బానిసైన ట్విన్స్- సొంత సోదరితోనే లైంగిక సంబంధం
ఇటీవల పోర్న్ వీడియోలకు బానిసైన ఓ 14 ఏళ్ల బాలుడు తన సోదరితోనే లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భవతి కావడం వల్ల అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.