Coast Guard Drug Bust : గుజరాత్‌లో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్‌బందర్‌లో భారత నౌకా దళం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి 3,300 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశాయి. ఈ డ్రగ్స్‌ను ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3,300 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నామని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురిని అరెస్ట్ చేశామని, అందులో నలుగురు ఇరాన్ దేశస్థులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
సీజ్ చేసిన డ్రగ్స్‌లో 3089 కేజీలు చరాస్, 158 కేజీలు మెథాంఫెటమైన్, 25 కేజీలు మార్ఫైన్ ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. స్మగ్లింగ్ విషయాన్ని నిఘా విమానం పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ గుర్తించిందని వెల్లడించింది. వెంటనే అటువైపు తమ నౌకను పంపించినట్లు వివరించింది. పరిమాణం పరంగా ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారని పేర్కొంది. సీజ్ చేసిన డ్రగ్స్, అందులోని సిబ్బందిని తీరానికి చేరిన తర్వాత దర్యాప్తు ఏజెన్సీలకు అప్పజెప్పినట్లు స్పష్టం చేసింది.
అమిత్ షా స్పందన
సముద్రంలో భారీ స్థాయిలో డ్రగ్స్ సీజ్ చేసి ఏజెన్సీలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్‌ను మాదకద్రవ్యరహిత దేశంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఏజెన్సీలు పనిచేశాయని చెప్పారు. 'ఎన్సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి 3123 కేజీల భారీ డ్రగ్ కన్సైన్మెంట్ను సీజ్ చేశారు. దేశాన్ని డ్రగ్-ఫ్రీగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ విజయం అద్దం పడుతుంది. ఈ సందర్భంగా ఎన్సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులకు నేను అభినందనలు తెలియజేస్తున్నా' అని అమిత్ షా ట్వీట్ చేశారు.
ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందాలో సినీ నిర్మాత- రూ.2వేల కోట్ల నెట్వర్క్ గుట్టురట్టు
రూ.1100 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్- గోడౌన్లలో దాచిన 600కిలోలు స్వాధీనం