CBI Arrests EX RG Kar Hospital principal : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటుగా మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఘోష్‌ను సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి తరలించింది. వైద్యకళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్‌పై ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వ రోజు విచారించిన సీబీఐ అరెస్టు ఆయన్ను చేసింది. ఘోష్‌ను అరెస్టు చేసిన ఒక గంటలోపే, సీబీఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డుతో పాటు ఆస్పత్రికి సామాగ్రి సరఫరా చేసే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు.
సందీప్ ఘోష్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబరు వరకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అయితే, 2023లో బదిలీ అయినా, నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి వచ్చారు. వైద్య విద్యార్థి హత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్‌గా ఉన్నారు. వైద్యురాలి హత్యాచారంలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సుపరింటెండెంట్ అక్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో బంగాల్ ప్రభుత్వం ఆగస్టు 23న సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
VIDEO | Kolkata rape-murder case: RG Kar Medical College and Hospital's ex-principal Sandip Ghosh, who was arrested by CBI earlier today, taken to Nizam Palace.
— Press Trust of India (@PTI_News) September 2, 2024
Ghosh has been arrested in connection with the alleged financial misconduct at the establishment. pic.twitter.com/DaSxsSH9PD
ఇదీ కేసు నేపథ్యం!
అక్తర్ అలీ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ''2023 జులై 14న అలీ రాసిన లేఖ ప్రకారం, ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చారు. ఇక ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించారు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చారు. ఇక సరఫరాదారుల నుంచి 20 శాతం ఘోష్ కమిషన్ తీసుకునేవారు. అనాథ శవాలు, వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటివి ఆస్పత్రికి ప్రతి రెండు రోజులకు 500-600 కిలోలు వరకు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీయుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించేవారు" అని ఆరోపిస్తూ అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్‌మెంట్లకు ఫిర్యాదు చేశాడు.
అనాథ శవాలనూ వదలని ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ - సిట్ విచారణలో సంచలన విషయాలు! - kolkata doctor case