ETV Bharat / bharat

ఓట్స్‌తో ఈ బ్రేక్‌ఫాస్ట్‌ ట్రై చేశారంటే - ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందే! - how to make tasty pancakes

Carrot Cake Pancakes Recipe : ఉదయాన్నే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, ఓట్స్‌తో క్యారెట్‌ పాన్‌కేక్స్ ట్రై చేయండి. ఇవి ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిని ఎలా ప్రిపేర్‌ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Carrot Cake Pancakes Recipe
Carrot Cake Pancakes Recipe
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 4:58 PM IST

Carrot Cake Pancakes Recipe : పాన్‌ కేక్స్‌ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వీటిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ మహా ఇష్టంగా తింటారు. ఇక ఈ పాన్‌ కేక్‌లను ప్రతిసారి బయట దుకాణాల నుంచి తెచ్చుకుంటున్నారా? అయితే ఈసారి అలాకాకుండా మీరే ఇంట్లోనే ఒకసారి క్యారెట్‌లతో వీటిని ట్రై చేయండి. క్యారెట్‌లను నేరుగా తినడం ఇష్టంలేని పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టారంటే మళ్లీ మళ్లీ చేయమని తప్పకుండా అడుగుతారు. అలాగే క్యారెట్‌లతో పాటు ఇందులో ఓట్స్‌ పిండి కూడా కలపడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకీ ఈ క్యారెట్‌ పాన్‌కేక్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యారెట్ పాన్‌ కేక్ తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు..

  • 250 గ్రాముల ఓట్స్‌ పిండి
  • 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా
  • టీస్పూన్ దాల్చినచెక్క పొడి
  • 1/4 టీస్పూన్ జాజికాయ పొడి
  • 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె
  • 1 గుడ్డు
  • 1/2 టీస్పూన్ ఉప్పు
  • 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
  • 1/4 టీస్పూన్ ఎండిన అల్లం పొడి
  • 180 ml బాదం పాలు
  • 1 టేబుల్ స్పూన్ మపుల్ సిరప్
  • 120 గ్రా క్యారెట్ తురుము

( పైన తెలిపిన పదార్థాలు నలుగురికి పాన్‌కేక్‌లు తయారు చేయడానికి సరిపోతాయి.)

పాన్‌కేక్‌ తయారు చేసుకునే విధానం..

  • ముందుగా ఒక గిన్నెలో కోడి గుడ్డు పగలగొట్టి బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో ఓట్స్‌ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, అల్లం పొడి, జాజికాయ పొడిని కలుపుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి తరిగిన క్యారెట్‌ తురుమును యాడ్‌ చేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు దాంట్లో బాదం పాలను పోసుకొని మళ్లీ మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌవ్‌పై ఒక పాన్‌ను పెట్టండి. అది వేడయ్యాక కొబ్బరి నూనెను కొద్దిగా పాన్‌కు అప్లై చేయాలి.
  • ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా గరిటెతో తీసుకుని చిన్న పాన్‌కేక్లు వచ్చే విధంగా పాన్‌పై వేసుకోవాలి. అలా కొద్దిసేపు ఒక సైడ్‌ కాలిన తర్వాత మరోవైపునకు కొద్దిగా బ్రౌన్‌ కలర్‌ వచ్చే విధంగా కాల్చుకోవాలి.
  • ఇలా మిశ్రమాన్నంతా చిన్న చిన్న కేక్‌లుగా చేసుకున్న తర్వాత.. వాటిపై మపుల్ సిరప్‌ను చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్‌ పాన్‌కేక్స్‌ రెడీ!
  • ఇక వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల తొందరగా ఆకలి కాకుండా ఉంటుంది.
  • అలాగే ఓట్స్‌లో ఉండే ఫైబర్‌ రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఎంతో సహాయపడుతంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి.

కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

Egg Recipes Telugu : సండే స్పెషల్.. కాస్త వెరైటీగా ఈ 'గుడ్డు' స్నాక్స్ ట్రై చేయండి.. వెరీగుడ్ అనక మానరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.