ETV Bharat / bharat

గుడికి వెళ్లొస్తుండగా ఘోరప్రమాదం- ఒకే ఫ్యామిలీలోని ఆరుగురు స్పాట్​డెడ్​ - CAR ACCIDENT - CAR ACCIDENT

Car Accident In Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు సరిహద్దు గోడను కారు ఢీకొనడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

Car Accident In Madhya Pradesh
Car Accident In Madhya Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 7:36 AM IST

Updated : May 11, 2024, 8:51 AM IST

Car Accident In Madhya Pradesh : మధ్యప్రదేశ్​లోని సీహోర్​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గోడను ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో సల్కాన్​పుర్​ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ జరిగింది
భోపాల్​ డీఐజీ బంగ్లా ప్రాంతంలోని చౌక్సే నగర్​లో పాండే కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా సీహోర్​ జిల్లాలోని సల్కాన్​పుర్​లో ఉన్న బిజాసన్ మాత ఆలయానికి తమ 5నెలల చిన్నారికి తలనీలాలు అర్పించడానికి వెళ్లారు. అనంతరం భైరవ లోయ నుంచి తిరిగి ఇంటికి పయణమయ్యారు. అయితే సాయంత్రం 6గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హోషంగాబాద్​ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బుధనీ ఎస్​డీపీఓ శశాంక్​ గుర్జార్ తెలిపారు.

ఈ ప్రమాదంపై మాజీ సీఎం కమల్‌నాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "సీహోర్ జిల్లాలోని సల్కాన్‌పుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భోపాల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు." అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.

ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
ఇటీవల కర్ణాటకలోని బాగల్​కోట్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మట్టి లోడ్​తో వెళ్తున్న లారీ బలిగొంది. రోడ్డు పక్కన నిల్చున వారిపై ఆ లారీ బోల్తా పడడం వల్ల అక్కడికక్కడే వారంతా మృతిచెందారు. ఏప్రిల్​లో జరిగిన ఈ ఘటనలో లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

సైబర్​ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం- 28200 మొబైళ్లు బ్లాక్​- 20లక్షల నంబర్లు కట్! - DOT BLOCKS MOBILE HANDSETS
ఎన్​కౌంటర్​లో 12మంది మావోయిస్టులు హతం- 900మందితో రౌండప్​! - Maoist Encounter Chhattisgarh

Last Updated : May 11, 2024, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.