ETV Bharat / bharat

ఇంటి పైకప్పుపై బస్సు- సీట్లు, టీవీ, లైట్లు సైతం- ఎక్కడో తెలుసా? - panjab man bus on roof

Bus On House Roof : కొంతమందికి అందరిలా కాకుండా ఏదైనా భిన్నంగా చేయాలనే కోరిక ఉంటుంది. పంజాబ్​కు చెందిన వ్యక్తి సైతం అలాగే ఆలోచించి, తన ఇంటిపైనే బస్సును ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆయన ఇంటిపై బస్సును ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 8:50 PM IST

ఇంటిపైకప్పుపై బస్సు- రూ.2.5లక్షలతో ఏర్పాటు- ఎక్కడో తెలుసా?

Bus On House Roof : ఇంటిపైకప్పుపై ఏకంగా ఓ బస్​ను ఏర్పాటు చేశారు విశ్రాంత ఆర్​టీసీ ఉద్యోగి. ప్రస్తుతం ఆ బస్​ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. అచ్చం బస్సులో ఉన్నట్లుగానే స్టీరింగ్, సీట్లు, లైట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేశారు పంజాబ్​కు చెందిన రేషమ్​సింగ్​. కంగ్​సాహెబ్​ ప్రాంతానికి చెందిన రేషమ్​సింగ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందారు. బస్సులంటే ఎంతో ఇష్టపడే రేషమ్​ సింగ్​, తన ఇంటిపైనే ఆ తరహా నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని భావించారు.

"నేను పీఆర్టీసీ టెక్నికల్ విభాగంలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించాను. ఇంటిపై బస్సును ఏర్పాటు చేయాలనేది నా కల. దీనిని 2018 నుంచే ఈ పని ప్రారంభించా. అయితే కొవిడ్​ వల్ల నేను అనారోగ్యానికి గురవ్వడం వల్ల పనులకు కొంత ఆటంకం కలిగింది. అనంతరం కొవిడ్ ​నుంచి కోలుకుని బస్సు పనిని తిరిగి ప్రారంభించాను.". - రేషమ్​ సింగ్​, పీఆర్టీసీ మాజీ ఉద్యోగి

విధి నిర్వహణలో తనకు లభించిన మెమొంటోలను బస్సులో అందంగా అలంకరించారు రేషమ్​సింగ్. తనతో కలిసి పనిచేసిన తోటి సహోద్యోగుల పేర్లను బస్సులో రాశారు. వీటితో పాటు బస్ లోపల టీవీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం బస్ నిర్మాణం కోసం సుమారు రూ.2.5 లక్షల వెచ్చించినట్లు చెబుతున్నారు. ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఈ బస్సును తన వారసులు పరిరక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Bus On House Roof
ఇంటిపైకప్పుపై బస్సు

ఆటోపై 'మినీ తోట' సమ్మర్​లో సూపర్​ కూల్ సెల్ఫీలతో ఎక్స్​ట్రా ఇన్​కమ్​!
అంతకుముందు బిహార్​కు చెందిన మహేంద్ర కుమార్ ఆటోపై మినీ తోట వేశాడు. వేసవిలో సూర్య ప్రతాపంతో విసిగిపోయిన అతడికి, రెండేళ్ల క్రితం ఓ 'చల్లటి' ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా దానిని ఆచరణలో పెట్టాడు. ఇందుకోసం టాప్​పై మ్యాట్​ పరిచి, మట్టి వేసి మొక్కలు నాటాడు. రోజూ నీళ్లు పోసి, ఎప్పటికప్పుడు మొక్కలు కత్తిరిస్తూ ఆటో తోటను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్

ఇంట్లోనే మ్యూజియం- బ్రిటిష్ కాలంనాటి వస్తువుల సేకరణ! రిటైర్డ్​ ప్రొఫెసర్ ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.