ETV Bharat / bharat

బ్రిజ్​భూషణ్​కు షాక్​- టికెట్​ నిరాకరించిన బీజేపీ- ఆయన స్థానంలో బరిలోకి కుమారుడు - Brij Bhushan Son Gets BJP Ticket - BRIJ BHUSHAN SON GETS BJP TICKET

Brij Bhushan Son Gets BJP Ticket : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను బీజేపీ పక్కన పెట్టింది. లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్​ నిరాకరించింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్​కు అవకాశం ఇచ్చింది.

Brij Bhushan Son Gets BJP Ticket
Brij Bhushan Son Gets BJP Ticket (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 7:19 PM IST

Updated : May 3, 2024, 6:49 AM IST

Brij Bhushan Son Gets BJP Ticket : రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్​కు బీజేపీ టికెట్​ నిరాకరించింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడి బరిలోకి దింపింది. ఉత్తర్​ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ స్థానం నుంచి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయ్​బరేలీ నుంచి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌కు టికెట్​ ఇచ్చింది.

కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో గెలుపొందారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. అప్పటి నుంచి బ్రిజ్‌భూషణ్‌ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే, జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో ఆయనను బీజేపీ హైకమాండ్‌ పక్కనబెట్టింది.

కేసులున్నా మంచి పాపులారిటీ!
ఉత్తర్​ప్రదేశ్‌లో అతిపెద్ద నేతల్లో ఒకరిగా బ్రిజ్‌భూషణ్‌ శరణ్​ సింగ్​కు పేరు ఉంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నా, ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో మంచి పాపులారిటీ సంపాదించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో ఆయన హవా కనపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కైసర్‌గంజ్‌ స్థానంలో బీజేపీ ఆయన కుమారుడికి అవకాశం కల్పించినట్లు సమాచారం.

బ్రిజ్‌భూషణ్‌ చిన్న కుమారుడైన కరణ్‌ ప్రస్తుతం యూపీ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్నారు. గోండాలోని కో-ఆపరేటివ్‌ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు అధ్యక్షుడిగానూ కరణ్​ ఉన్నారు. బ్రిజ్‌భూషణ్‌ మరో కుమారుడు ప్రతీక్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

రాయ్‌బరేలీ బరిలో మంత్రి
మరోవైపు, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ స్థానంలో రాష్ట్ర మంత్రి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ను కమలం పార్టీ బరిలోకి దించింది. 2019 ఎన్నికల్లోనూ ఈయన సోనియాపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో శాససమండలి నుంచి ఎన్నికై కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. తొలుత ఈ స్థానం నుంచి వరుణ్‌ గాంధీని నిలబెడతారని ప్రచారం జరిగింది. పార్టీ ప్రతిపాదనకు ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.

కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సోనియా ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. కుమార్తె కోసమే ఆమె పోటీ నుంచి వైదొలిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై కాంగ్రెస్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కైసర్‌గంజ్‌, అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి తుది గడువు శుక్రవారం (మార్చి 3)తో ముగియనుంది.

Last Updated : May 3, 2024, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.