ETV Bharat / bharat

నల్ల టమాటాతో లాభాల 'పంట'- కిలో@150- ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

Black Tomato Cultivation In Bihar : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్ల టమాటాలను పండిస్తున్నారు బిహార్​కు చెందిన రైతు. ఇప్పటికే ఆయన నల్ల బంగాళదుంపలు, అల్లాన్ని కూడా పండించారు. మరి ఈ బ్లాక్ టమాటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Black Tomato Cultivation In Bihar
Black Tomato Cultivation In Bihar
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 10:20 AM IST

Updated : Feb 4, 2024, 10:51 AM IST

Black Tomato Cultivation In Bihar : సాధారణంగా టమాటాలు ఏ రంగులో ఉంటాయో అందరికీ తెలుసు. కానీ బిహార్​లోని గయాకు చెందిన ఓ రైతు మాత్రం నల్ల టమాటాలను పండిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ నల్ల టమాటాలను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఆయన నల్ల బంగాళదుంపలు, నల్ల అల్లం కూడా పండిస్తున్నారు.

Black Tomato Cultivation In Bihar
నల్ల టమాటా మొక్క
Black Tomato Cultivation In Bihar
నల్ల అల్లం, బంగాళదుంపలు

అయితే నల్ల టమాటాల కోసం 22-25 మొక్కలు నాటానని, కేవలం 10-12 మొక్కలు మాత్రమే జీవం పోసుకున్నాయని రైతు ఆశిశ్​ కుమార్ సింగ్ తెలిపారు. విపరీతమైన చలి కారణంగా మిగతా మొక్కలు మొలకెత్తలేదని చెప్పారు. ప్రస్తుతం టమాటాలు చిన్నగా ఉన్నాయని, పూర్తిగా పండిన తర్వాత నల్లగా మారుతాయని పేర్కొన్నారు రైతు. ఫైవ్ స్టార్ హోటళ్లలో బ్లాక్ టమాటాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, సలాడ్ కోసం ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారని చెప్పారు.

Black Tomato Cultivation In Bihar
రైతు ఆశిష్ కుమార్ సింగ్

"ఎరుపు టమాటా కన్నా నల్ల టమాటాలో ఆంథోసైనిన్ స్థాయి చాలా ఎక్కువ. కొన్ని వ్యాధులు నయం కావడానికి బ్లాక్ టమాటాలు సహకరిస్తాయి. వైద్యానికి సంబంధించిన ఓ కథనం చదవడం వల్ల నాకు ఈ నల్ల టమాటాలను పండించాలన్న ఆలోచన వచ్చింది. అమెజాన్​లో విత్తనాలను ఆర్డర్ చేసి బ్లాక్ టమాటాలను సాగు చేయడం ప్రారంభించాను"

- ఆశిశ్​ కుమార్ సింగ్, రైతు

పోషక గుణాలు ఎక్కువ!
నల్ల టమాటాల్లో పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయని మగధ్ యూనివర్సిటీ బోటన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ కుమార్ సింగ్ చెప్పారు. రెడ్ టామాటాల కంటే బ్లాక్ టమాటాల్లో ఆంథోసైనిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. నల్ల టమాటాను మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడ్డ వారు తింటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Black Tomato Cultivation In Bihar
టమాటాలను చూస్తున్న రైతు

"వీటిలో ఆంథోసైనిన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల నలుపు లేదా ఊదా రంగులో టమాటాలు ఉత్పత్తి అవుతాయి. బ్రిటన్​లో తొలిసారి పండిన ఈ టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి. ఇప్పుడు గయాలో బ్లాక్ టమాటా సాగు ప్రారంభమవ్వడం శుభపరిణామం"

-డా. అమిత్ కుమార్ సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్

ధర కాస్త ఎక్కువే!
అయితే ఎర్ర టమాటాల కన్నా నల్ల టమాటా ధర కాస్త ఎక్కువే ఉంటుంది. కిలో రూ.100 నుంచి 150 పలుకుతోంది. వీటిని పండించడంలో ప్రత్యేక ఖర్చు లేకపోయినా ఆదాయం మాత్రం ఎక్కువే వస్తుంది. ప్రస్తుతం బంగాల్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.

ఎకరంలో టమాటా సాగు.. మూడు నెలల్లోనే లక్షాధికారిగా మారిన రైతు

'ధరలు తగ్గేలా చూడు దేవుడా!'.. టమాటాల దండలతో ప్రత్యేక పూజలు

Last Updated : Feb 4, 2024, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.