ETV Bharat / bharat

రూపాయి కట్నంతో కుమారుడికి వివాహం- ఆదర్శంగా నిలిచిన బీజేపీ నేత - హరియాణాలో రూపాయి కట్నంతో పెళ్లి

One Rupee Wedding In Haryana : వధువు తండ్రి ఇచ్చిన కట్నాన్ని నిరాకరించి, ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని తన కుమారుడి వివాహం చేయించారు ఓ బీజేపీ నేత. కేవలం రూపాయితో పాటు కొబ్బరికాయను తీసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ బీజేపీ నేత ఎవరంటే?

One Rupee Wedding In Haryana
One Rupee Wedding In Haryana
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 1:21 PM IST

Updated : Feb 20, 2024, 2:10 PM IST

One Rupee Wedding In Haryana : కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని తన కుమారుడికి వివాహం చేశాడు ఓ బీజేపీ నేత. పెళ్లి మండపంలో బంధువుల అందరి ముందు వధువు తండ్రి ఇచ్చిన కట్నాన్ని నిరాకరించి ఒక్క రూపాయి, కొబ్బరికాయను మాత్రమే స్వీకరించారు. ఈ ఆదర్శ వివాహం హరియాణాలో జరిగింది.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్ కుమారుడు గౌరవ్​ సబ్​ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్నారు. గౌరవ్​కు​ హరియాణా రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఛైర్మన్ భూపాల్ సింగ్​ కాదరీ కూమార్తె గరిమాతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వివాహ వేడుకలో బంధువులు అందరి ముందు వరుడికి భూపాల్ సింగ్ కట్నం ఇచ్చారు. అయితే, ఆ కట్నాన్ని వరుడి తండ్రి కృష్ణ చౌకర్ నిరాకరించారు. బ్యాగ్​లో నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారందరూ వరకట్నానికి వ్యతిరేకంగా ఆదర్శంగా నిలిచినందుకు కృష్ణ చౌకర్​పై ప్రశంసలు కురిపించారు.

వరకట్నం సమాజానికి శాపమని బీజేపీ నేత కృష్ణ చౌకర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 'వరకట్నం తీసుకోవటం పూర్తిగా నిషేధించాలి. వరకట్నం వ్యవస్థ పూర్తిగా తొలగిన తర్వాతే కుమారుడు, కూతుళ్ల మధ్య ఉన్న వివక్షత పోతుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని గౌరవ్​ ముందే నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి తల్లిదండ్రులుగా మేము కూడా మద్దతు ఇచ్చాం' అని కృష్ణ చౌకర్ తెలిపారు.

పంచాయతీ సభ్యుడిపై గ్రామస్థుల ప్రేమ- అమ్మాయిని వెతికి మరీ పెళ్లి
ఇటీవలే కర్ణాటకలో గ్రామస్థులు అందరూ కలిసి తమ గ్రామ పంచాయతీ సభ్యుడికి అమ్మాయిని వెతికి మరీ వివాహం చేశారు. పెళ్లి ఖర్చులు కూడా భరించారు. ఈ వేడుకను ఘనంగా జరిపించి నూతన దంపతులను ఆశ్వీరాదించారు. దావణగారే మండలంలోని గూడాల్ గ్రామ పంచాయతీ సభ్యుడు అంజినప్ప(45). అంజినప్ప అంటే ఊరందరికీ ప్రేమ. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశాడు. అలానే తన ఓమ్ని కారును అంబులెన్స్​గా మార్చి అత్యవసర సేవలు అందిస్తున్నాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​పై చేయండి.

పొగమంచులోనే జవాన్ పెళ్లి​ బరాత్​- 10 కి.మీలు డ్యాన్స్​ చేస్తూ ఊరేగింపు

28 వెడ్స్​ 14- పేరెంట్స్​కు తెలియకుండా మ్యారేజ్​, పుట్టింటికి పంపించనని వింత వాదన!

Last Updated : Feb 20, 2024, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.