ETV Bharat / bharat

పర్ఫెక్ట్ లైఫ్​ పార్ట్​నర్​ను - ఎలా సెలక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా?

Suitable Partner for Marriage : అందచందాల్లోనే కాదు.. ఆలోచనలు, అభిప్రాయాల్లోనూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటేనే.. ఆ సంసారం సాగరంపై విహారంలా ఉంటుంది. తేడా వస్తే మాత్రం కల్లోలంగా మారిపోతుంది. అందుకే.. భాగస్వామి విషయంలో ప్రతి ఒక్కరూ అన్ని విషయాలనూ ఆరాతీస్తారు. మరి.. ఇంతకీ పర్ఫెక్ట్ లైఫ్​ పార్ట్​నర్​ను ఎలా సెలక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 2:00 PM IST

Marriage
Suitable Partner for Marriage

Best Ways to Find Suitable Partner for Marriage : వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. చక్కటి భాగస్వామిని పెళ్లి చేసుకొని.. వైవాహిక జీవితాన్ని హాయిగా కొనసాగించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ.. వివాహం తర్వాత తేడాలు వచ్చి ఎన్నో జంటలు విడిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో.. పర్ఫెక్ట్ పార్ట్​నర్​ను ఎలా సెలక్ట్ చేసుకోవాలి? పెళ్లికి ముందు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? అన్నది చూద్దాం.

సెల్ఫ్ రిఫ్లెక్షన్ : మీరు సరైన జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే.. ఒకరికొకరు ఇష్టాలు, కోరికలు, జీవిత లక్ష్యాలు, ముఖ్యంగా విలువలు.. వీటిని ఒకరికొకరు షేర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా.. మీ లైఫ్ పార్ట్​నర్​ ఆలోచనలు మీకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అన్నది చాలా వరకు తెలిసిపోతుందని చెబుతున్నారు.

ఆన్‌లైన్ ప్లాట్‌ ఫారమ్‌ : లైఫ్​పార్ట్​నర్​లో ఎలాంటి క్వాలిటీస్​ ఉండాలి? అనే విషయంలో ఈ జనరేషన్ ఆలోచనలు చాలా వేగంగా మారుతున్నాయి. అందుకు అనుగుణంగానే డేటింగ్​ యాప్స్​, మ్యాట్రిమోనీ వెబ్​సైట్లు వంటి ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా తమకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న లైఫ్ పార్ట్​నర్​ని ఈజీగా వెతుక్కోవచ్చు.

జాబితా రెడీ చేసుకోండి : పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్​నర్​ను ఎంచుకోవడానికి మీరు చేయాల్సిన మరో పని.. మీరు కోరుకునే జీవిత భాగస్వామిలో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలకు సంబంధించి ముందే జాబితా సిద్ధం చేసుకోవడం. ఎలాంటి విలువలు ఉండాలని కోరుకుంటున్నారు?, కమ్యూనికేషన్ స్టైల్, విద్య, కుటుంబ నేపథ్యం, భవిష్యత్తు ఆకాంక్షలు వంటి అంశాలతో ఓ లిస్టు ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో.. కాబోయే పార్ట్​నర్​ మీకు సూట్ అవుతారా? లేదా? అన్నది త్వరగా తేల్చేయొచ్చు.

రిలేషన్స్, ఫ్రెండ్స్ : స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీకు సంబంధించిన వివరాలు చెప్పి.. వారి ద్వారా మంచి లైఫ్​పార్ట్​నర్​ను వెతికే ప్రయత్నం చేయొచ్చు. ఒకరకంగా.. ఇప్పుడు అమల్లో ఉన్న పద్ధతే ఇది. బంధువులు, మిత్రుల ద్వారా వధువు, వరుడి వివరాలు తెలుసుకొని.. ఆ తర్వాత వెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం.. ఈ పద్ధతిలోనూ వధూవరులు ప్రైవేటుగా మాట్లాడుకునే విధానం పెరుగుతోంది. అయితే.. ఏదో నామమాత్రంగా కాకుండా.. మీరు ఎవరికి వారు జాబితా ప్రిపేర్ చేసుకొని.. అందుకు అనుగుణంగా ఉన్నారా లేదా? అన్నది తెలుకొని ఓ నిర్ణయానికి వస్తే.. భవిష్యత్​లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

వెయిట్ చేయండి : జీవిత భాగస్వామి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పెళ్లి తర్వాత తేడాలు వస్తే.. రెండు వైపులా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి.. కాస్త ఎక్కువ సమయం తీసుకునే మీకు తగిన లైఫ్​పార్ట్​నర్​ను ఎంచుకోవడం ముఖ్యం. సో.. పైన చెప్పిన సూచనలన్నీ పరిగణనలోకి తీసుకొని మీ జీవితానికి సరిపడే భాగస్వామిని ఎంచుకోండి.

Tips For Dating to Marriage: డేటింగ్​ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మరిచిపోవద్దు!

మీ పార్ట్​నర్​తో గొడవ పడినప్పుడు ఈ మాటలు అంటున్నారా? - అయితే విడాకులు ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.