ETV Bharat / bharat

ఎండిపోతున్న సరస్సుల్లోకి నీరు విడుదల- బెంగళూరు నీటి కొరత తీర్చేందుకు అధికారుల పాట్లు - bangalore water problem

Bangalore Water Crisis : బెంగళూరులో నీటి వృథాను అరికట్టేందుకు కర్ణాటక సర్కారు రంగంలోకి దిగింది. భూగర్భ జలాలను పెంచేందుకు ఎండిపోతున్న సరస్సులను నీటితో నింపాలని నిర్ణయం తీసుకుంది.

Bangalore Water Crisis
Bangalore Water Crisis
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 2:03 PM IST

Bangalore Water Crisis : బెంగళూరులో నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీటి ఎద్దడిని తీర్చేందుకు ఎండిపోతున్న సరస్సులను నీటితో నింపనున్నారు. బోర్​వెల్స్​ 50శాతానికి పైగా ఎండిపోయిన తరుణంలో భూగర్భ జలాలను పెంచేందుకు సుమారు 1,300 మిలియన్ లీటర్స్​ పర్ డే (MLD) శుద్ధి చేసిన నీటిని సరస్సుల్లో నింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సరస్సుల వద్ద సాంకేతికతను ఉపయోగించి వాటర్​ ప్లాంట్స్​, ఫిల్టర్​ బోర్​వెల్స్​ను ఏర్పాటు చేయనున్నామని బెంగళూరు వాటర్​ సప్లై అండ్​ సీవరేజ్​ బోర్డ్​ (BWSSB) తెలిపింది. ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ సహకారాన్ని తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఫలితంగా సుమారు 20-30 MLD నీరు సరఫరా వ్యవస్థకు చేరుతుందని వెల్లడించారు. కొటే, బెల్లందూర్​, వర్తూర్​, నయందహళ్లి, హెరోహళ్లి, అత్తూర్​, జక్కూర్​ సరస్సుల్లో నీటిని నింపనున్నట్లు BWSSB ఛైర్మన్​ రామ్​ ప్రసాద్​ మనోహర్ తెలిపారు.

బెంగళూరు నగరానికి రోజుకు 2,100 మిలియన్​ లీటర్ల మంచినీరు అవసరం ఉంటుందని, ఇందులో 1,450 మిలియన్ లీటర్లు కావేరీ నది నుంచి వస్తాయని అధికారులు వివరించారు. మిగిలిన 650 మిలియన్ లీటర్లు బోర్​వెల్స్​ నుంచి వస్తాయని, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల 250 మిలియన్​ లీటర్లు లోటు ఏర్పడుతుందన్నారు. అవసరాలకు సరిపోయేంత నీరు జలాశయాల్లో అందుబాటులో ఉందని చెప్పారు. మార్చి నుంచి మే వరకు నగరానికి 8 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, జలశయాల్లో 34 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు.

హాస్టళ్లలో డిస్పోజల్​ ప్లేట్లు
మరోవైపు నీటి సమస్యను తప్పించుకునేందుకు బెంగళూరులోని హాస్టళ్ల నిర్వాహకులు డిస్పోజల్​ కప్పులు, ప్లేట్లు, గ్లాసులను వినియోగిస్తున్నారు. ఇప్పటికే తమ బోర్​వెల్స్​ ఎండిపోయాయని, ప్రస్తుతం తాము వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నామని హాస్టళ్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్​ చెప్పారు. సుమారు 90శాతం నీరు పాత్రలను శుభ్రం చేయడానికే పోతాయని, అందుకోసమే డిస్పోజల్​ వస్తువులను వాడుతున్నామని వివరించారు. ఉగాదికి కూడా వర్షాలు పడకపోతే, తాము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు.

తాగునీటిని అందుకు వాడితే రూ.5వేలు ఫైన్​
నీటిని వృథా చేస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని ప్రకటించిన BWSSB, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తాగునీటిని సాధారణ కార్యకలాపాలకు వినియోగించడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని అతిక్రమించిన వారికి రూ.5వేలు జరిమానా వేస్తామని వెల్లడించింది. తాగు నీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, రోడ్డు, భవన నిర్మాణం, ఫౌంటెన్​ లాంటి వినోద కార్యక్రమాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. మాల్స్​, సినిమా హాల్స్​ సైతం నీటిని పరిమితంగా వినియోగించాలని సూచించింది. ప్రజలకు తాగు నీటిని అందించడమే ప్రథమ లక్ష్యమని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.