ETV Bharat / bharat

అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు- 11 రోజుల్లో 25 లక్షల మందికి రామయ్య దర్శనం - Ayodhya Ram Mandir Hundi Collection

Ayodhya Ram Mandir Devotees Darshan : కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Ayodhya Ram Mandir Devotees Darshan
Ayodhya Ram Mandir Devotees Darshan
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 6:50 AM IST

Updated : Feb 2, 2024, 7:30 AM IST

Ayodhya Ram Mandir Devotees Darshan : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు.

Ayodhya Ram Mandir Hundi Collection : 'బాలక్‌ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేయగా, గత 11 రోజుల్లో రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్​లైన్​ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. వీరిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు ఉన్నారు. అయోధ్య రామయ్యకు భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుంది' అని ఆలయ ట్రస్టు ఆఫీస్‌ ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ గుప్తా తెలిపారు.

ఆలయ వేళలు పొడిగింపు!
Ayodhya Ram Mandir Temple Timings : భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలక్‌ రామ్‌ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి.

అయోధ్యకు స్పైస్‌జెట్​ ఫ్లైట్​ సేవలు!
Spicejet Flight To Ayodhya : దేశంలోని ప్రధాన 8 నగరాలను అయోధ్యతో కలుపుతూ ప్రత్యేక స్పైస్‌జెట్​ డైరెక్ట్​ ఫ్లైట్​ సేవలను ప్రారంభించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. గురువారం జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో పాటు ఆ రాష్ట్ర మంత్రి వీకే సింగ్​ పాల్గొన్నారు. దర్భంగా, అహ్మదాబాద్​, చెన్నై, జయపుర​, పట్నా, దిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ కనెక్టివిటీ ద్వారా దేశంలోని పర్యటక రంగం మరింత మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి యోగి అన్నారు.

అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?

అయోధ్య యాత్రికులకు Paytm బంపర్ ఆఫర్​ - బస్, ఫ్లైట్​ బుకింగ్స్​పై 100% క్యాష్ బ్యాక్​!

Last Updated : Feb 2, 2024, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.