Ayodhya Crowd Status : సరిగ్గా నెలరోజుల క్రితం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల రామభక్తుల కల నెరవేరింది. నూతన నిర్మించిన మందిరంలో జనవరి 22వ తేదీన రామచంద్రుడు కొలువుదీరారు. ఆ తర్వాత రోజు నుంచే సామాన్య భక్తులకు రామయ్య దర్శనానికి అనుమతించింది శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్. ఎప్పుడెప్పుడా అని రాఘవుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
'ఎన్నో జన్మల పుణ్యఫలమో'
దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు విదేశాలను నుంచి కూడా భక్తులు రామనగరికి వస్తున్నారు. శ్రీరాముడిని దర్శించుకుని పరవశించిపోతున్నారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలమో అంటూ బాలరాముడిని దర్శించుకున్నారు. జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజూ అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి. సూర్యోదయం అవ్వగానే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రాముడికి దర్శనానికి వెళ్తూనే కనిపిస్తున్నారు.
60 లక్షలకు మందికిపైగా
ప్రాణప్రతిష్ఠ జరిగిన మొదటి పది రోజుల్లో బాలక్రామ్ను 25 లక్షలకు మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అంటే రోజుకు సగటున 2.5 లక్షల మంది సందర్శించారన్నమాట. ఆ తర్వాత ఫిబ్రవరిలో రోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది రాము భక్తులు శ్రీరాముడిని దర్శించుకుంటున్నట్లు ఆలయ ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాశ్ గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 60 లక్షలకు మందికిపైగా సందర్శించి ఉంటారని ఆయన అంచనా వేశారు.
12 కిలోమీటర్ల దూరం నుంచే సందడి
దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరం నుంచే సందడి కనిపిస్తోంది. అయోధ్య ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ పార్కింగ్ స్థలానికి సుదూర ప్రాంతాలను నుంచి భక్తులను తీసుకొచ్చే బస్సులు తరలివస్తూనే ఉన్నాయి. జై రామ్ అంటూ యాత్రికులు కీర్తిస్తూనే ఉంటున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న డార్మిటరీ, లాడ్జి, సత్రాల వద్ద తమ అవసరాలు తీర్చుకుని రామ్ మార్గ్‌లోకి ప్రవేశిస్తున్నారు.
పటిష్ఠ ఏర్పాట్లు
నగరంలో ఎలాంటి ట్రాఫిక్ తలెత్తకుండా అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వెళ్లే భక్తులు, తిరిగి వచ్చే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్యూ ఏర్పాటు చేశారు. ఆలయానికి నడుస్తూ రామస్త్రోత్రాలను కొందరు భక్తులు స్తుతిస్తున్నారు. మరికొందరు పాదరక్షలు లేకుండానే నడుస్తున్నారు. స్థానికుల ద్వారా యాత్రికులు నుదిటిపై పసుపు వర్ణంతో బొట్లు పెట్టించుకుంటున్నారు. రామ నామం రాయించుకుని ఆలయానికి వెళ్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన భక్తులు తమ సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేస్తున్నారు.
అనేక మంది ప్రముఖులు
పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులతోపాటు నటీనటులు కూడా రామయ్య దర్శనం చేసుకుంటున్నారు. ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ తమ కుటుంబసభ్యులతో ఆలయాన్ని సందర్శించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు ఫిబ్రవరి 11న ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా మంగళవారం తన మంత్రివర్గంతో రామయ్యను దర్శించుకున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, రాముడి విగ్రహ దర్శనానికి గంట నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతోంది. రాముడి ముందు కూర్చుని గుడి లోపల మరికొన్ని నిమిషాలు గడపాలని అనిపించిందని భక్తులు చెబుతున్నారు. తమకు రామయ్య దర్శన భాగ్యం లభించిందని, అంతకుమించి ఏం వద్దని అంటున్నారు. రామయ్య రూపాన్ని మదిలో ఊహించుకుంటూ రామనగరి నుంచి ఇంటిబాట పడుతున్నారు భక్తులు.
'ఐదేళ్ల బాలరాముడు ఒత్తిడి తట్టుకోలేరు- అందుకే దర్శనానికి రోజూ గంట బ్రేక్'
అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు తెలుసుకోవడం మస్ట్!