Atishi assumes charge as Delhi CM : దిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆతిశీ, రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే కేజ్రీవాల్ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు దిల్లీ సీఎంగా పని చేస్తానని అన్నారు. కేజ్రీవాల్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని ఆతిశీ విమర్శించారు.
VIDEO | AAP's Atishi (@AtishiAAP) takes charge as Delhi Chief Minister. Here's what she said.
— Press Trust of India (@PTI_News) September 23, 2024
" today, i have taken the charge as delhi cm. i am feeling the same as lord bharat took the reign after lord ram went on 'vanvaas'. arvind kejriwal has set a new benchmark, he was kept… pic.twitter.com/VWeYG0JKdI
'ఖాళీ కుర్చీ కేజ్రీవాల్ కోసం వెయిట్ చేస్తుంది'
"నేను దిల్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే నాకు ప్రస్తుతం రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితే ఎదురైంది. రాముడి వనవాస సమయంలో భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఎలాంటి బాధ కలిగిందో, ఇప్పుడు నాకు అలాగే బాధగా ఉంది. రాముడి 14ఏళ్ల వనవాసం సమయంలో సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. వచ్చే నాలుగు నెలలు నేను కూడా అలాగే పరిపాలిస్తాను. అరవింద్ కేజ్రీవాల్ గౌరవం, నైతికతకు ఉదాహరణగా నిలిచారు. గత రెండేళ్లుగా బీజేపీ ఆయన ఇమేజ్‌ను దిగజార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి, ఆరు నెలలు జైల్లో ఉంచింది. దీంతో ప్రజల్లో తిరిగి విశ్వసనీయత పొందేవరకు సీఎం సీటులో కూర్చోనన్నారు కేజ్రీవాల్. అందుకే రాజీనామా చేశారు. దిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్‌దే. దిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తున్నా. అప్పటివరకు ఈ ఖాళీ కుర్చీ ఈ ఆఫీస్‌లోనే ఉంటుంది. కేజ్రీవాల్ కోసం ఎదురుచూస్తుంది" అని ఆతిశీ అన్నారు.
'రాజ్యాంగాన్ని అగౌరపరిచారు'
అయితే ఆతిశీ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆమె ఖాళీ కుర్చీని చూపించడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. దాని అర్థం, ఆమె తనను తాను సీఎం పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎంగా ఉండి, మరో వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకోవడం, ఆ స్థానాన్ని, రాజ్యాంగాన్ని అగౌరపరచడం అని అన్నారు. "నేను దిల్లీ సీఎంకు ఓ లేఖ రాశాను. అయితే ఆ లేఖను ఎవరు చదువుతారు? ఒక సీఎం, తాను కీలుబొమ్మ అని ఎలా చెప్పుకోగలరు? వారు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు" అని మనోజ్ తివారీ మండిపడ్డారు.
#WATCH | Delhi: On Delhi CM Atishi, BJP MP Manoj Tiwari says, " ...atishi has taken oath as the delhi chief minister and if she shows an empty chair, this raises many questions. this means that she does not consider herself the chief minister. if being the chief minister herself,… pic.twitter.com/6ZlYLh5AGJ
— ANI (@ANI) September 23, 2024
'రబ్బర్ స్టాంప్, పప్పెట్ సీఎం'
లాలు ప్రసాద్ యాదవ్- రబ్డీ దేవి, మన్మోహన్- సోనియా మోడల్ లాగా ఆతిశీ- కేజ్రీవాల్ దిల్లీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. రబ్బర్ స్టాంప్, పప్పెట్ ముఖ్యమంత్రిని సీఎంగా ఎందుకు చేశారని దిల్లీ ప్రజలు ప్రశ్నిస్తున్నారని భండారీ అన్నారు. "దిల్లీ ప్రజలంటే ఆతిశీ, కేజ్రీవాల్‌కు ద్వేషం. వారు దిల్లీ ప్రజలకు ఒక తాత్కాలిక సీఎంను ఇవ్వలేకపోయారు. కానీ ఒక పప్పెట్ సీఎంను ఇచ్చారు" అని బంఢారీ ధ్వజమెత్తారు.
#WATCH | BJP spokesperson Pradeep Bhandari says, " atishi and arvind kejriwal want to run government like lalu-rabri model and manmohan-sonia model. they want to run a corrupt government. the people of delhi are asking them a question as to why a rubber stamp or a puppet cm is… pic.twitter.com/2Xr85OJZTh
— ANI (@ANI) September 23, 2024
26, 27వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు
కాగా, ఆతిశీతో పాటు పర్యావరణ శాఖ మంత్రిగా గోపాల్ రాయ్, కార్మిక ఎస్సీ, ఎస్టీ, ఉపాధి, భవనాల శాఖ మంత్రిగా ముఖేశ్ అహ్లావత్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 26, 27వ తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. విద్య, రెవెన్యూ, ఆర్థిక, విద్యుత్ సహా 13 మంత్రిత్వ శాఖలు ఆతిశీ వద్ద ఉన్నాయి.
టీచర్ నుంచి దిల్లీ సీఎంగా- ఆప్ ఫైర్‌బ్రాండ్ ఆతిశీ మార్లీనా ప్రస్థానం ఇదే! -
దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం- అతి తక్కువ వయసులోనే పగ్గాలు - Atishi sworn in as Delhi CM