Assam Gang Rape Accused : అసోంలోని నాగావ్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి మృతి చెందాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం నేరం జరిగిన ప్రదేశానికి పోలీసలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొని చెరువులోకి దూకాడు. వెంటనే అతడి కోసం వెతకగా, దాదాపు రెండు గంటల తర్వాత అతని మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.
#WATCH | Visuals from Assam's Nagaon from where the body of the prime accused of the Dhing gang rape case, Tafazul Islam recovered from a pond.
— ANI (@ANI) August 24, 2024
" when a police team took him last night to the spot for investigation where the incident took place, the prime accused tried to flee… pic.twitter.com/bphTviFrPA
ఇదీ కేసు
అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లారు. అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయారు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు రక్షించారు. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామనీ, మరొకరిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం పోలీసులు ప్రకటించారు. ఇందులో ప్రధాన నిందితుడిని కైమ్ సీన్ రిక్రియేషన్ కోసం శనివారం తెల్లవారుజామున తీసుకెళ్లగా, ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
VIDEO | Assam: The prime accused in the rape of a minor girl allegedly escaped from police custody, jumped into a pond and died on Saturday morning at #Dhing in Assam's #Nagaon district. Visuals of the body of the accused being taken away after it was recovered by the police from… pic.twitter.com/YtHNZgR2Lo
— Press Trust of India (@PTI_News) August 24, 2024
నిరసనలతో అట్టుడుకిన అసోం!
బాలిక అత్యాచార ఘటనపై శుక్రవారం అసోంవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. హేయమైన నేరానికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు నిందితుల విషయంలో పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ టెస్ట్- ప్రధాని మోదీకి మమత లేఖ - Kolkata Doctor Case