ETV Bharat / bharat

'సీఎం విధులకు ఎవరైనా అంతకాలం దూరంగా ఉండొచ్చా?'- కేజ్రీవాల్ అరెస్టుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - Arvind Kejriwal Delhi High Court - ARVIND KEJRIWAL DELHI HIGH COURT

Arvind Kejriwal Delhi High Court : ముఖ్యమంత్రిగా కొనసాగడం అరవింద్​ కేజ్రీవాల్​ వ్యక్తిగత నిర్ణయం అని దిల్లీ హైకోర్టు పేర్కొంది. కానీ ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం, దిల్లీ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఉచిత పుస్తకాలు పొందేందుకు అ​డ్డు కాదని స్పష్టం చేసింది. పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోవడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు కోర్టు వ్యాఖ్యానించింది.

Arvind Kejriwal Delhi High Court
Arvind Kejriwal Delhi High Court
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 5:35 PM IST

Updated : Apr 29, 2024, 6:53 PM IST

Arvind Kejriwal Delhi High Court : ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనే నిర్ణయం అరవింద్​ కేజ్రీవాల్​ వ్యక్తిగతమని దిల్లీలో హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడం, దిల్లీ మున్సిపల్​ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటివి అందుకోవడానికి అడ్డుకారాదని తేల్చి చెప్పింది. దానర్థం పిల్లల ప్రాథమిక హక్కులను కాలరాయడం కాదని మండిపడింది. ఎమ్​సీడీ పాఠశాలల విద్యార్థులు వారి రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులకు అనుగుణంగా ఉచిత పుస్తకాలు, రైటింగ్ మెటీరియల్​, యూనిఫాం పొందేందుకు అర్హులని కోర్టు పేర్కొంది. వేసవి సెలవులకు పాఠశాలలు మూసివేయనున్నందున, రూ.5 కోట్ల పరిమితితో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్​సీడీ కమిషనర్​ను కోర్టు ఆదేశించింది. పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోవడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ అంశంపై తాత్కాలిక దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ మన్మోహన్, జస్టిస్ మన్మీత్​ పీఎస్​ అరోరా సోమవారం విచారణ జరిపారు. 'జాతీయ, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా చాలా కాలం పాటు అజ్ఞాతంలో ఉండకూడదు లేదా గైర్హాజరు కాకూడదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేమని చెప్పడం తప్పు' అని ధర్మాసనం పేర్కొంది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి పదవి అలంకారప్రాయం కాదని కోర్టు తెలిపింది. వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటి ఏవైనా సంక్షోభాల్ని ఎదుర్కోవడానికి పదవిలో ఉన్న వ్యక్తి 24*7 అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.

కేజ్రీవాల్​కు బెయిల్​పై విచారణ
మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్​కు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్​ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా సర్వోన్నత న్యాయస్థానానికి ఎందుకు వచ్చారని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు నివేదించారు. ఆప్ అధినేతను 'అక్రమంగా అరెస్ట్' చేయడం కూడా వాటిలో ఒకటని వివరించారు. ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగనున్నాయి.

2021-22కు మద్యం పాలసీ రూపకల్పనలో అవినీతి, మనీలాండరింగ్ జరిగాయన్న కేసులో అరవింద్ కేజ్రీవాల్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో భాగంగా దిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.

కంట్రోల్​ కోల్పోయిన అమిత్​ షా హెలికాప్టర్​- గాల్లో ఊగిసలాట- త్రుటిలో తప్పిన పెను ప్రమాదం - Amit Shah Helicoptor Loses Control

చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్​డ్రా- వెంటనే బీజేపీలో చేరిక - Indore congress candidate

Last Updated : Apr 29, 2024, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.