ETV Bharat / bharat

అరుణాచల్​ బీజేపీదే - వరుసగా మూడోసారి అధికారంలోకి కమలదళం - Arunachal Pradesh Election Results

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 1:13 PM IST

Updated : Jun 2, 2024, 3:19 PM IST

Arunachal Pradesh Election Results 2024 : అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ మ్యాజిక్​ ఫిగర్​ను క్రాస్​ చేసి విజయం ఢంకా మోగించింది. 60 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు గెలిచింది. మొత్తం 46 సీట్లను కైవసం చేసుకుంది. మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Arunachal Pradesh Election Results 2024
Arunachal Pradesh Election Results 2024 (ANI)

Arunachal Pradesh Election Results 2024 : అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ మరోసారి విజయం సాధించింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సొంతం చేసుకుంది. మొత్తం 60 స్థానాల్లో 46 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్​ ఫిగర్​ దాటింది. దీంతో అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పార్టీ శ్రేణులు ఈటానగర్​తో​ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.

10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం
ఏప్రిల్ 19న మొదటి దశ లోక్​సభ ఎన్నికలతో పాటు 50 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మొత్తం 50 స్థానాల్లో బీజేపీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల ఫలితాలు జూన్‌ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ ఆదివారంతో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండటం వల్ల కౌంటింగ్​ను రెండు రోజుల ముందు ఏర్పాటు చేసింది.

పొంచౌ వక్కా స్థానంలో మంత్రి హోన్​చుంగ్ 4వేల ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థిపై విజయం సాధించారు. నాచో నియోజకవర్గంలో 1,373 ఓట్లతో పర్యటక శాఖ మంత్రి నకప్​ నాలో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. టోపిన్ ఈటే చేతిలో 1,951 ఓట్ల తేడాతో ఎన్​పీపీ అభ్యర్థి ఓడిపోయారు. కొలోరియాంగ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి 10 వేల ఓట్ల తేడాతో పీపీఏ అభ్యర్థిపై గెలుపొందారు. దోయిమఖ్ నియోజకవర్గంలో పీపీఏ అభ్యర్థి నబమ్ వివేక్​ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై 2,530 ఓట్ల తేడాతో గెలుపొందారు. తవాంగ్​లో ఎన్​పీపీ అభ్యర్థి నామ్​గే త్సెరింగ్ బీజేపీ అభ్యర్థిని ఓడించారు.

2019 అరుణాచల్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారం చేపట్టింది. నేషనల్​ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) మూడు స్థానాలను కైవసం చేసుకుంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్​ రెండు, ఎన్​సీపీ, కాంగ్రెస్, ఇతరులు ఒక్కొక్క స్థానాల్లో గెలిచారు.

ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతుంది? స్ట్రాంగ్ రూమ్​లను ఎవరు తెరుస్తారు? అర్హతలేంటి? - How Votes Are Counted

పరారీలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ- ప్రశ్నించేందుకు ఇంటికి వెళ్లి చూడగా! - Bhavani Revanna Absconding

Last Updated : Jun 2, 2024, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.