ETV Bharat / bharat

కన్నడ యాక్టర్​ దర్శన్‌ 'మేనేజర్' ఆత్మహత్య - ఘటన స్థలంలో కీలక ఆధారాలు! - Actor Darshan Manager Found Dead

Actor Darshan Manager Found Dead : కన్నడ యాక్టర్​ దర్శన్​ దగ్గర పనిచేస్తున్న మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ అభిమానిని హత్య చేసిన కేసులో ఇరుకున్న దర్శన్​కు ఇది మరింత తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది.

kannada Actor Darshan
Actor Darshan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 6:53 PM IST

Updated : Jun 18, 2024, 7:01 PM IST

Actor Darshan Manager Found Dead : రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్​కు మరో చిక్కు ఎదురైంది. ఆయన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్‌ తూగుదీప అరెస్ట్​ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసు కన్నడనాట సంచలనం సృష్టిస్తోంది.

ఆత్మహత్యకు కారణం ఏమిటి?
బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో మేనేజర్ శ్రీధర్ ఆత్యహత్య చేసుకున్నాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. మేనేజర్​ మృతదేహంతో పాటు ఒక సూసైడ్‌నోట్‌, ఒక వీడియో సందేశాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలిపాయి. మీడియా కథనాల ప్రకారం, 'ఒంటరితనం వేధిస్తుండడం వల్లనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో, వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.' ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టయిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.

నటి పవిత్రా గౌడ, దర్శన్‌లు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌కు ఇది వరకే విజయలక్ష్మి అనే మహిళతో పెళ్లి అయ్యింది. దీనితో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ చిచ్చుపెట్టిందని దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) ఆగ్రహంతో ఉండేవాడు. అక్కడితో ఆగకుండా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అశ్లీల సందేశాలు పంపుతూ, దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనితో ఆగ్రహించిన దర్శన్​, కొంత మంది వ్యక్తుల సాయంతో రేణుకా స్వామిని హత్య చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. పోలీసులు ఇప్పటికే దర్శన్​, పవిత్ర గౌడ్​ సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పబ్​లో పార్టీ
తన అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్టు అయిన కన్నడ నటుడు దర్శన్‌, హత్య జరిగిన రోజు పబ్‌లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనంతరం నేరుగా రేణుకస్వామిని కిడ్నాప్‌ చేసి గోడౌన్‌కు వెళ్లినట్టు సమాచారం. రేణుకస్వామి హత్య తరువాత నిందితుల్లో ముగ్గురు బెంగళూరులోని ఆర్‌ఆర్‌ నగర్‌లో ఉన్న రిలయన్స్‌ ట్రెండ్స్‌కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురిని పోలీసులు రిలయన్స్‌ ట్రెండ్స్‌కు తీసుకెళ్లి సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ చేశారు. హత్య తరువాత రేణుకస్వామి దగ్గర ఉన్న బంగారం గొలుసు, పర్సును నిందితులు ఎత్తుకెళ్లగా, తాజాగా పోలీసులు వాటిని గుర్తించారు. చిత్రదుర్గలో నిందితుడు రాఘవేంద్ర నివాసంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు.

విచారణకు హాజరైన కమీడియన్ చిక్కన్న
హత్య జరిగిన రోజు దర్శన్‌తో పాటు ఉన్న కన్నడ నటుడు, కమీడియన్ చిక్కన్న పోలీసుల విచారణకు హాజరయ్యారు. దర్శన్‌ భోజనానికి పిలిస్తే తాను రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న స్టోని బ్రూక్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు చిక్కన్న తెలిపారు. దీనిపై ప్రశ్నలు అడిగేందుకు తనను పోలీసుల పిలిచారని చెప్పారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించానని, ఇంత కన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేనని చెప్పారు. విచారణకు హాజరైన చిక్కన్న, కస్టడీలో ఉన్న దర్శన్‌ను పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం స్టోని బ్రూక్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. అనంతరం చిక్కన్న, దర్శన్‌తో పాటు ఆరుగురు నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దర్శన్‌ను మైసూరుకు కూడా తీసుకెళ్లి సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ చేయాలని పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేణుకస్వామి హత్య తరవాత దర్శన్‌ షూటింగ్ నిమిత్తం మైసూరుకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేశాడు. అక్కడే అరెస్టు కాకుండా పోలీసులను ఒప్పించేందుకు దర్శన్‌ ప్రయత్నించాడని సమాచారం.

సీబీఐ విచారణ!
మరోవైపు రేణుకస్వామి హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని, పోలీసులు ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా పనిచేస్తున్నారని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. జూన్‌ 8న హత్యకు గురైన రేణుకస్వామి తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ఇది ఆ ఒక్క కుటుంబానికే కాదని అందరికీ బాధకరమైన విషయని అన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి.దయానంద తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రేణుకస్వామి హత్య కేసులో పోలీసులు వేగంగా, సకాలంలో చర్యలు తీసుకున్నారని అన్నారు. కోర్టులో ఆధారాలను సమర్పించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన, ఇందుకు మీడియా సహకారం కావాలని కోరారు.

దేశంలో పలు ఎయిర్​పోర్టులకు బాంబు బెదిరింపులు- పోలీసులు హై అలర్ట్​- విమానాశ్రయాల్లో ముమ్మర తనిఖీలు

రైతులకు శుభవార్త - పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోదీ - చెక్ చేసుకోండిలా - PM KISAN SAMMAN NIDHI YOJANA

Last Updated : Jun 18, 2024, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.