ETV Bharat / bharat

అదుపుతప్పి 20 అడుగుల లోయలో పడ్డ బస్సు- 19మంది మృతి- 8మందికి తీవ్ర గాయాలు - Accident In Chhattisgarh - ACCIDENT IN CHHATTISGARH

Accident In Chhattisgarh : ఛత్తీస్​గఢ్​లోని కవర్ధలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపుతప్పి 20 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19మంది మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

Accident In Chhattisgarh
Accident In Chhattisgarh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 3:38 PM IST

Updated : May 20, 2024, 6:15 PM IST

Accident In Chhattisgarh : ఛత్తీస్​గఢ్​లోని కవర్ధలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునికాకు సేకరణకు వెళ్లి తిరిగి వస్తున్న గిరిజనుల వాహనం అదుపుతప్పి 20 అడుగుల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 19మంది మరణించారు. ఇందులో 17మంది మహిళలతో పాటు డ్రైవర్​ ఉన్నాడు. కాగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్డూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బహ్పాని గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టమ్​ పరీక్షల కోసం పంపించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డిప్యూటీ సీఎం సంతాపం
ప్రమాద ఘటనపై చత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి విజయ్​ శర్మ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సాయం చేసేందుకు అధికారులను ఆదేశించామని చెప్పారు.

టైర్​ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి
ఇటీవలె మధ్యప్రదేశ్​​లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ట్రక్కును ఢీ కొనడం వల్ల 8మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఇందౌర్- అహ్మదాబాద్​ జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కారు టైర్​ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

ఒడిశాలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి
Road Accident In Odisha : ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు విడిచారు. బుధవారం రెండు ట్రక్కుల మధ్య ఓ కారు ఇరుక్కోవడం వల్ల జరిగిందీ దుర్ఘటన. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : May 20, 2024, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.