ETV Bharat / bharat

7ఏళ్లకే UPSC, బీటెక్​ స్టూడెంట్స్​కు కోచింగ్​- 14 అంశాల్లో పాఠాలు చెబుతూ రికార్డ్​ - 7year old boy teaches upsc coaching

7 Year Old Teacher Guru Upadhyay : అతడి వయసు 7ఏళ్లు- కానీ లెక్చరర్​. అదేంటి ఇంత చిన్న వయసులో కూడా లెక్చరర్​ అవ్వొచ్చా అని ఆలోచిస్తున్నారా? కానీ, ఉత్తర్​ప్రదేశ్​ మథుర జిల్లాలోని బృందావన్​ ప్రాంతానికి చెందిన గురు ఉపాధ్యాయ్​ అలియాస్​ గూగుల్​ గురు మాత్రం దీనిని సాధించి చూపించాడు. మరి ఆ బుల్లి లెక్చరర్​ కథేంటో చూద్దాం రండి.

Google Guru Seven Year Old Guru Upadhyay Prepares Engineers And UPSC Aspirants

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 2:09 PM IST

ఔరా అనిపిస్తున్న 7 ఏళ్ల బుడతడు- UPSC, బీటెక్​ స్టూడెంట్స్​కు 14 అంశాల్లో పాఠాలు బోధన- బుల్లి లెక్చరర్​గా రికార్డు!!

7 Year Old Boy Teaches UPSC Coaching : ఆ పిల్లాడి వయసు కేవలం 7 ఏళ్లే. కానీ అప్పుడే UPSC, బీటెక్​ విద్యార్థులకు పాఠాలు బోధించే స్థాయికి ఎదిగాడు. అది కూడా ఒకటి, రెండు కాదు ఏకంగా 14 సబ్జెక్టుల్లో అభ్యర్థులకు విద్యను బోధిస్తున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​ మథుర జిల్లాలోని బృందావన్​ ప్రాంతానికి చెందిన గురు ఉపాధ్యాయ్​ వీరికి పాఠాలు చెబుతూ​ గూగుల్​ గురుగా ప్రసిద్ధి పొందాడు.

'బుల్లి లెక్చరెర్​'గా రికార్డు
UPSCకి సన్నద్ధమయ్యే​ అభ్యర్థులతో పాటు ఇంజినీరింగ్​ పరీక్షల కోసం ప్రిపేర్​ అవుతున్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు గోరా నగర్​ కాలనీకి చెందిన గురు ఉపాధ్యాయ్​. సుమారు 14 అంశాల్లో అభ్యర్థులకు పాఠాలు​ చెబుతున్నాడు. ఇలా 5ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి బోధిస్తున్నాడు గురు ఉపాధ్యాయ్​. ఈ బుడతడి ప్రతిభకు ఇటీవలే ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో కూడా చోటు దక్కింది. అంతేకాకుండా దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన 'బుల్లి లెక్చరెర్​'గా రికార్డు సృష్టించాడు.

గురు ఉపాధ్యాయ్​ను చాలామంది ముద్దుగా గూగుల్​ గురు అని కూడా పిలుచుకుంటారు. ఇతడు కేవలం ఆఫ్​లైన్​లోనే మాత్రమే కాకుండా ఆన్​లైన్​లోనూ అభ్యర్థులకు పాఠాలు బోధిస్తాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్​ ఛానల్​నూ నిర్వహిస్తున్నాడు. దీని సాయంతో ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా క్లాసెస్​ చెబుతుంటాడు.

17 నెలల వయసులోనే!
ఇక ఈ గూగుల్​ గురు (గురు ఉపాధ్యాయ్​) అసాధారణ ప్రతిభా పాటవాల గొప్పతనం అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్​ నృత్య గోపాల్​ దాస్​ జీ మహారాజ్​ వరకు చేరింది. ఇది తెలుసుకున్న ఆయన స్వయంగా గురు ఇంటికి వచ్చి మరీ అతడిని ప్రశంసించి సత్కరించారు. గురు 17 నెలల వయసులో ఉన్నప్పుడే చదువు పట్ల అతడిలోని ఆసక్తిని, అసాధారణ ప్రతిభను గమనించారు అతడి తల్లిదండ్రులు. అలా అప్పటినుంచి తమ కుమారుడిని ప్రోత్సహిస్తూ చిన్న వయసులోనే అతి కష్టంగా పరిగణించే సివిల్స్​, ఇంజినీరింగ్​ సంబంధిత సబ్జెక్టులను నేర్పించారు. ఫలితంగా ప్రస్తుతం ఎంతోమంది యువతీయువకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తరగతులు చెబుతున్నాడు.

"గురు తాజాగా ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్‌ నుంచి సర్టిఫికెట్​ అందుకున్నాడు. యూపీఎస్సీతో పాటు ఇంజినీరింగ్​ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కేవలం ఏడేళ్ల వయస్సులోనే 14 ప్రధాన సబ్జెక్టుల్లో పాఠాలు చెబుతున్నాడు గురు ఉపాధ్యాయ్​. ఇతడు కేవలం ఆఫ్​లైన్​లో మాత్రమే కాదు ఆన్​లైన్​లోనూ పాఠాలు బోధిస్తాడు. అతికష్టమైన ప్రశ్నలకు గురు కొన్ని సెకన్లలోనే సమాధానం ఇస్తాడు. నా కుమారుడి ప్రతిభను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షులు మహంత్​ నృత్య గోపాల్​ దాస్​ జీ మహారాజ్​ సైతం మెచ్చుకున్నారు. ఇది తల్లిదండ్రులుగా మాకెంతో గర్వకారణం. గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం."

--అరవింద్​ కుమార్​ ఉపాధ్యాయ్​, గూగుల్​ గురు తండ్రి

మగ బిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి- 58ఏళ్ల వయసులో డెలివరీ

కేజ్రీవాల్​కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు- బెయిల్​ వచ్చిన మరుసటి రోజే నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.