ప్రతిధ్వని: బిహార్లో ఎన్నికల పోరు - pratidwani-over-bihar-elections
ఎన్నికల నగరా మోగటం వల్ల బిహార్లో రాజకీయ సమరం ఊపందుకుంది. అక్టోబరు 28, నవంబరు 3, నవంబరు 7వ తేదీల్లో మూడు దశల్లో బిహార్ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. కరోనా విజృంభణ తర్వాత దేశంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం వల్ల అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలతో ఏర్పాట్లు చేశారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది. భాజపా జేడీయూతో కలిసిన ఎన్డీఏ కూటమితో తలపడేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్లో ఎన్నికల పోరుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Sep 26, 2020, 11:47 PM IST