bogatha waterfalls: మైమరిపించే జలధారల సవ్వడులు.. బొగత సొగసు చూడతరమా..! - తెలంగాణ టాప్ న్యూస్ 2021
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం(bogatha waterfalls) సరికొత్త అందాలను సంతరించుకుంది. పచ్చని ప్రకృతి నడుమ జలపాతం నుంచి పాలనురగను తలపించేలా వరదనీరు దూకుతోంది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో పెనుగోలు అటవీ ప్రాంతంలోని కొండకోనల్లో జాలువారుతూ మైమరిపిస్తోంది. రమణీయమైన బొగత జలపాత హొయలు ఏకధాటి వానలతో మరింతగా పెరిగాయి. కొండల పైనుంచి దూకుతున్న పాలనురగ వంటి జలధారలు కనువిందు చేస్తున్నాయి.