ఫ్యాషన్ వీక్.. మోడళ్ల అదిరే ర్యాంప్ వాక్!
వాణిజ్య రాజధాని ముంబయిలో మూడు రోజుల పాటు జరిగే ' టైమ్స్ ఫ్యాషన్ వీక్' ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమంలో విభిన్న దుస్తులు ధరించి మోడళ్లు అలరించారు. డిజైనర్స్ ప్రదర్శించిన సంప్రదాయ, ఎంబ్రాయిడరీ, మోడ్రన్ దుస్తులు చూపరులను ఆకట్టుకున్నాయి. డిజైనర్ సమంత్ చౌహాన్.. యువతుల మనసుకు నచ్చేలా విభిన్న వస్త్రాలు రూపొందించింది.