ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ - ఇప్పుడైన యువతకు మేలు జరుగునా?
Published : Dec 12, 2023, 9:29 PM IST
|Updated : Dec 12, 2023, 10:07 PM IST
TSPSC Issues in Telangana : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - టీఎస్‌పీఎస్సీపైనే. ఎన్నికలకు ముందు అక్కడ చోటుచేసుకున్న వివాదాలు, ప్రస్తుత కొత్త ప్రభుత్వం ఆలోచనలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే అందుకు కారణం. కమిషన్ ఛైర్మన్ బీ జనార్థనరెడ్డి రాజీనామా, సంస్థపై ముఖ్యమంత్రి సమీక్షతో ఒక్క విషయమైతే స్పష్టం అవుతోంది. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన పక్కా. మరి ఆ మార్పు, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు ఎలా ఉండాలి? లక్షల మంది నిరుద్యోగులు, యువత నమ్మకానికి తగినరీతిలో ఈ రాజ్యాంగ సంస్థను నిలబెట్టడంలో సర్కార్ అధిగమించాల్సిన సవాళ్లేంటి?
పల్లెల నుంచి నగరాలకు వచ్చి కోచింగ్‌లు తీసుకునే వారు కొందరు విశ్వవిద్యాలయాల హాస్టళ్లలో విరామం ఎరగకుండా సన్నద్ధమయ్యే యువత మరికొందరు వారి కుటుంబాల నేపథ్యమేంటి? పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై వారు ఎటువంటి ఆశలు పెట్టుకుంటారు? కొత్త సంవత్సరంలో యువత ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.