తెలంగాణ

telangana

Congress BSP Conflict in Sangareddy

ETV Bharat / videos

నామినేషన్​ వేసేందుకు ఒకేసారి వచ్చిన బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులు - పటాన్​చెరులో ఉద్రిక్తత - సంగారెడ్డి జిల్లాలో నామినేషన్లు

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 4:05 PM IST

Tension in Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్ వేయడానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గానికి సంబంధించిన బీఎస్పీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ అభ్యర్థి కాటం శ్రీనివాస్ గౌడ్(Congress candidate Katam Srinivas Goud Nomination 2023) ఒకేసారి నామినేషన్ వేయడానికి రావడంతో ఆయా పార్టీల అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. పోలీసు బందోబస్తు నడుమ ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్లారు.

Congress BSP Followers Conflict in Sangareddy: బీఎస్పీ, కాంగ్రెస్‌ వర్గాలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నామినేషన్‌ కేంద్రం వద్ద ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌, బీఎస్పీ వర్గాలను పోలీసులు బారికేడ్లతో దూరం పెంచి అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details