తెలంగాణ

telangana

ETV Bharat / videos

SRSP Water Level Today : ఎస్సారెస్పీకి భారీగా తగ్గిన వరద ప్రవాహం.. నిజాంసాగర్​ ప్రాజెక్ట్ పరిస్థితీ సేమ్ - Nizamabad District News

🎬 Watch Now: Feature Video

SRSP

By

Published : Jul 30, 2023, 2:13 PM IST

Sri Ram Sagar Project Water Level Today :రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. గత రెండ్రోజులుగా భారీ స్థాయిలో వచ్చిన వరద నేడు.. 8100 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గానూ.. 1090 అడుగుల నీటి నిల్వ ఉంది. అదేవిధంగా 90 టీఎంసీల నీటి నిల్వకు గానూ.. 84.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్​ఫ్లో కొనసాగుతుండగా.. ఎస్కేప్ గేట్ల ద్వారా 8100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయానికీ వరద నీరు తగ్గింది. ఎగువ నుంచి 4,800 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో రెండు గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1404.68 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.34 టీఎంసీలుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details