తెలంగాణ

telangana

Revanth Reddy Challenged to CM KCR

ETV Bharat / videos

ఉచిత కరెంటుపై సీఎం కేసీఆర్​కు మరోసారి రేవంత్​రెడ్డి సవాల్ - కేసీఆర్​కు రేవంత్​ రెడ్డి సవాల్​

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 2:03 PM IST

Revanth Reddy Challenges CM KCR :రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ సరఫరాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. ప్రభుత్వానికి మరోసారి సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిరూపిస్తే.. సాయంత్రంలోగా తన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 3గంటల్లోగా ముగియనున్నందున.. ఆలోగా తన సవాల్‌ను కేసీఆర్‌ స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

కామారెడ్డి ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు వారి బూత్​లో భారీ మెజారిటీ వచ్చేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి మూడు రోజులకో సారి కామారెడ్డిలో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి కార్యకర్త ఓ సైనికునిలా పని చేసి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కేసీఆర్​ గజ్వేల్​లో ఓడిపోతానని భావించి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాని రేవంత్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details