Prathidwani : ఇస్రో గగన్‌యాన్ సాకారం దిశగా తొలి అడుగు.. శాస్త్ర, సాంకేతిక ప్రయోజనాలేమిటి..?
Published : Oct 21, 2023, 8:36 PM IST
Prathidwani Debate on ISRO Gaganyaan Mission 2023 : రోదసిలోకి సొంతగా వ్యోమగాములను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ -టీవీ-డీ1 వాహకనౌక పరీక్ష విజయవంతం అయింది. షార్ నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగికి దూసుకు వెళ్లడం.. తర్వాత విడిపోయిన క్రూ మాడ్యూల్.. సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగడం.. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగిపోయాయి.
ఈ మిషన్ ద్వారా ఇస్రో ఆశిస్తున్న లక్ష్యాలేమిటి? గగన్‌యాన్ ద్వారా ఇస్రో వ్యోమగాములను అంతరిక్షంలో పంపాలని ఇంత పట్టుదలతో పని చేస్తూ ఉండడానికి కారణమేంటి? గగన్‌యాన్ ద్వారా శాస్త్ర, సాంకేతికంగా ప్రయోజనాలేమిటి? గగన్‌యాన్ సన్నద్ధత సమీక్ష సందర్భంగా ప్రధానిమోదీ చేసిన రెండు ప్రధాన సూచనలు 1- ఇస్రో సొంత అంతరిక్ష కేంద్రం, 2040కల్లా జాబిల్లిపై భారతీయుల అడుగు. వీటి ప్రాధాన్యతఏమిటి? మానవసహిత అంతరిక్ష పరిశోధనలు సాకారమైతే ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.