తెలంగాణ

telangana

Postal Voting Begins in Telangana

ETV Bharat / videos

రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ ఓటింగ్ ప్రారంభం - ముందుగా సమాచారం ఇచ్చి ఇళ్లకు వెళ్తున్న అధికారులు - తెలంగాణలో పోస్టల్ ఓటింగ్ 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 2:42 PM IST

Postal Voting Begins in Telangana :రాష్ట్రంలోని ప్రత్యేక కేటగిరీ ఓటర్లు తమ ఇళ్ల నుంచే ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సిద్ధిపేట జిల్లాలో అధికారులు పోస్టల్ ఓటు వేయించుకున్నారు. ఈ ప్రక్రియను ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల చొప్పున నిర్వహిస్తూ.. ఈ నెల 29లోపు పూర్తి చేస్తారు. తెలంగాణలో ఇంటి నుంచి ఓటు వేసేందుకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితర 13 విభాగాల వారు దరఖాస్తు చేసుకున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం అధికారులు వారి ఇళ్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. 

Postal Voting in Telangana 2023 :తాము ఏ సమయానికి రాబోయే విషయాన్ని ఓటర్లకు, రాజకీయ పార్టీలకు ముందే సమాచారం ఇస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది దరఖాస్తు దారుడి ఇంటికి వెళ్లి బ్యాలెట్‌ పత్రాలు అందించి ఓట్లు వేసిన అనంతరం వాటిని సేకరిస్తున్నారు. ఒకవేళ అధికారులు వెళ్లిన రోజు ఓటరు ఇంటివద్ద లేనట్లైతే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మరో తేదీ కేటాయించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details