తెలంగాణ

telangana

Minister Mallareddy Dance

ETV Bharat / videos

Minister Mallareddy Dance : మంత్రి మల్లారెడ్డి కిర్రాక్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్

By

Published : Jun 12, 2023, 1:04 PM IST

Minister Mallareddy Dance in Telangana Run : తన మాటలతో, చేష్టలతో, ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి.. మరోసారి ప్రచారంలోకెక్కారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, సినిమా ఫంక్షన్‌ అయినా.. వేదిక ఏదైనా మల్లారెడ్డి ఉన్నారంటే ఆ సందడే వేరు. ఆయన మైక్‌ పట్టుకున్నారంటే చాలు.. 'కష్టపడ్డా.. పాలమ్మినా.. సక్సెస్‌ అయ్యా' డైలాగ్‌ ప్రేక్షకుల నుంచి వినబడక మానదు. ఆ ఒక్క డైలాగ్‌తో సోషల్‌ మీడియాలోనూ తెగ పాపులర్‌ అయిన మంత్రి.. తాజాగా తన డ్యాన్స్‌ ఫెర్ఫార్మెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పీర్జాధిగూడ కార్పొరేషన్‌ పరిధిలో జరిగిన తెలంగాణ పరుగు కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌, రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన 2కే రన్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు మంత్రి మల్లారెడ్డి బహుమతులు అందించారు. ఈ క్రమంలోనే వేదికపై మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు వేశారు. సినిమా పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేసి కార్యక్రమానికి వచ్చిన వారిలో ఫుల్‌ జోష్‌ నింపారు.

ABOUT THE AUTHOR

...view details