తెలంగాణ

telangana

ఫుడ్‌ ఫెస్టివల్‌

ETV Bharat / videos

Italian food festival Hyderabad : నోరూరించే వంటకాలతో ఫుడ్‌ ఫెస్టివల్‌ - జూబ్లీహిల్స్ తాజా వార్తలు

By

Published : Jul 11, 2023, 2:19 PM IST

Special Italian food festival at Jubilee Hills : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని  ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ భాగ్యనగర భోజన ప్రియులను నోరూరిస్తోంది. మంచి రుచికరమైన ఇటాలీయన్‌ వెజ్‌, నాజ్‌ వంటకాలతో ఆహారాభిమానులను రా రమ్మంటూ ఆహ్వానిస్తుంది.  హైదరాబాద్‌కు చెందిన  యువ మహిళా పారిశ్రామికవేత్త స్వాతిరెడ్డి ప్రత్యేకమైన ఇటాలీయన్‌ రుచులతో పాటు భారతీయ వంటకాలు అందించేందుకు డో మామా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆహారోత్సవం ఏర్పాటు చేశారు. ఇందులో మంచి రుచికరమైన ఇటాలీయన్‌ వంటకాలతో పాటు నగరవాసుల అభిరుచులకు తగిన విధంగా వంటకాలను అందిస్తున్నట్లు డో మామా రెస్టారెంట్‌ ఎండీ స్వాతిరెడ్డి తెలిపారు.. ఇటాలీయన్‌ రుచులను భాగ్యనగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. విభిన్న రుచులు ఉండే  పిజ్జాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఆరగించవచ్చని రెస్టారెంట్‌ నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వాటిని నగరవాసులు మెచ్చే విధంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details