Inter Student Suicide in Hyderabad : ''సారీ అమ్మానాన్న'.. ఇదే నా చివరి రోజు ఇక నేను వెళ్తున్నా..' - నారాయణ కాలేజీలో వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య
Published : Oct 31, 2023, 10:57 PM IST
Inter Student Suicide in Hyderabad :మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం వేధింపులతో విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో వైభవ్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ విద్యార్థి లెటర్ రాశాడు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపాల్ ఒత్తిడి కారణంగానే వైభవ్ సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడని మృతుని తండ్రి ఆరోపించారు. మరెవరు ఈ కాలేజీలో జాయిన్ కావొద్దని.. ఉపాధ్యాయులు విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దనీ ఆయన కోరారు.
Inter Student Suicide at Meerpet Hyderabad :'ఇదే నా చివరి రోజు.. సారీ అమ్మానాన్న, తమ్ముడు అంటూ సూసైడ్ నోట్' రాసిన వైభవ్ మరణానికి.. న్యాయం జరిగే వరకూ శవపరీక్షకు పంపించలేమని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే కాలేజీ వద్ద ఎలాంటి అవాంతర ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.