పెళ్లి ముహూర్తానికి ముందు వరుడి నిరసన
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వాని ప్రాంతంలో గత నెలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా కత్గోదం హైదాఖాన్ రోడ్డు మూసుకుపోయింది. దీంతో అక్కడి స్థానికులు రోడ్డు వేయాలంటూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. అయితే ఆ నిరసనల్లో రాహుల్ అనే వరుడు పాలుపంచుకున్నాడు. రాహుల్ వచ్చి కాంగ్రెస్ నేతలకు సంఘీభావం తెలిపాడు. కాసేపటి తర్వాత పెళ్లి మండపానికి వెళ్లి వివాహం చేసుకున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST