Ganesh Immersion in Hayathnagar : నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు - Ganesh immersion in Hyderabad
Published : Sep 24, 2023, 9:48 PM IST
Ganesh Immersion in Hayathnagar :హైదరాబాద్లో వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది. గణేశ్ శోభాయాత్రలతో నగరంలోని వీధులన్నీ కోలాహలంగా మారాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ గణనాథుడి విగ్రహాలను ఊరేగింపునకు తరలిస్తున్నారు. నృత్యాలతో యువత హోరెత్తిస్తున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహారాజ్కి జై అంటూ.. విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లంబోదరుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు తరలి వెలుతున్నారు.
Ganesh Nimajjanam 2023 in Ranga Reddy : ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లెక్చరర్స్ కాలనీ సమీపంలోని త్యాగరాజ నగర్లో గణేశ్ శోభాయాత్ర(Ganesh Shobha Yatra)లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. నిమజ్జనం అంతా సందడిగా సాగింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు, యువతీ యువకుల నృత్యాల నడుమ శోభాయాత్ర కనులపండువగా సాగింది. ఆటపాటలు.. కోలాటాలు.. డప్పుల దరువులు.. పాటల హోరుతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చి.. మళ్లీ రావయ్యా విఘ్నేశ్వర అంటూ వారు బైబై చెప్పారు.