Ganesh 108 Prasadam Naivedyam : వినాయకుడికి 108 రకాల ప్రసాదాలు.. ఇంతకీ ఎక్కడ..?
Published : Sep 24, 2023, 5:15 PM IST
Ganesh 108 Prasadam Naivedyam :రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navratri Celebrations) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా.. మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ మండపాలలో విభిన్న రూపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు.. భక్తుల విశేష పూజలు అందుకుంటున్నాడు. మండపాల్లో నిర్వాహకులు ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హిందూ సనాతన ధర్మంలో వినాయకుడునీ ఉండ్రాళ్ల ప్రియుడని, నైవేద్య ప్రియుడని అంటూ ఉంటారు. అందుకే భక్తులు ఏడాదికి ఓసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారి ప్రసాదానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటారు. స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ల పాయసంతో పాటు.. వివిధ రకాలైన ఫలాలు సమర్పించి ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తారు.
Ganesh 108 Prasadam Naivedyam in Kumuram Bheem Asifabad : ఈ క్రమంలోనే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కన్యకపరమేశ్వరి కల్యాణ మండపంలో వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తూ.. గణపతిని పూజిస్తున్నారు. వాసవి గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఇవాళ లంబోదరునికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.