తెలంగాణ

telangana

అతి మూత్ర సమస్యలకు వైద్యుల సలహాలు

ETV Bharat / videos

షుగర్ వ్యాధి లేకున్నా.. అతిగా మూత్రం వస్తోందా? పరిష్కారం ఏంటి? - షుగర్ వ్యాధి మూత్ర సమస్యలు

By

Published : Jul 10, 2023, 10:51 AM IST

షుగర్​ వ్యాధి లేకపోయినా తరచూ మూత్రం వచ్చే సమస్యను కొందరు ఎదుర్కొంటుంటారు. మూత్రం ఆపుకోలేక ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా షుగర్ ఉన్న వాళ్లలో ఇలా అతి మూత్ర సమస్య ఉంటుంది. కానీ ఆ వ్యాధి లేకున్నా.. ఈ సమస్య ఎదురైతే అనేక అనుమానాలు వస్తుంటాయి. ఇలా తరచూ మూత్రం రావడానికి గల కారణాలేంటి? ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే విషయంపై నిపుణులు పలు సలహాలు ఇస్తున్నారు. 

తరచూ మూత్రం రావడానికి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. వాతావరణంలో మార్పులు, మోతాదుకు మించి నీరు తాగినప్పుడు ఇలా ఎక్కువగా మూత్రం వస్తుందని తెలిపారు. సాధారణంగా ఒక రోజు 2 - 2.5 లీటర్ల నీరు తీసుకుంటే పర్లేదు. కానీ అంతకు మించి నీరు తాగితే.. మూత్రం ఎక్కువగా రావొచ్చని అన్నారు. ఒకవేళ నీరు మామూలుగానే తాగి, ఎక్కువగా మూత్రం వస్తే.. పలు కారణాలు ఉన్నాయన్నన్నారు. మరి ఆ కారణాలు, సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details