Neera Cafe in Hyderabad: హుస్సేన్‌సాగర్ తీరాన నీరా కేఫ్.. నేడే ప్రారంభం.. - telangana latest news
Neera Cafe in Hyderabad: హైదరాబాద్ మహానగర వాసులకు అందమైన, అద్భుతమైన నీరా కేఫ్ అందుబాటులోకి వచ్చింది. హుస్సేన్ సాగర్ తీరాన అత్యంత ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ నేడే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీరా కేఫ్ ఏర్పాట్లను పరిశీలించారు. నీరా కేఫ్‌లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి..? నీరాలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి..? నీరాతో పాటు ఇంకా ఎలాంటి ఉత్పత్తులు నీరా కేఫ్‌లో అందుబాటులో ఉంటాయి..? తదితర వివరాలపై ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. 'నీరా అనేది చెట్టు ద్వారా సహజంగా వచ్చేది. దానిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలున్నాయి. దీనిలో కిడ్నీ సమస్యలను బాగు చేసే, క్యాన్సర్ రాకుండా చూసే గుణాలున్నాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని సైంటిఫిక్‌గా నిరూపణ అయ్యింది. దీనిని తాగితే ఎన్నో రోగాల నుంచి మనం బయటపడొచ్చు.' అంటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..