తెలంగాణ

telangana

College Students Fight

ETV Bharat / videos

College Students Fight in Chaderghat Viral Video : పరీక్షలో సాయం చేయలేదని విద్యార్థిపై దాడి.. వీడియో వైరల్ - వైరల్​గా మారిన సీసీ కెమెరాల దృశ్యాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 5:44 PM IST

College Students Fight in Chaderghat Viral Video:హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. పరీక్షల్లో సహకరించలేదని ఓ విద్యార్థిపై.. సహచర విద్యార్థి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరీఫ్‌ అనే విద్యార్థి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చాదర్‌ఘాట్‌ పోలీస్​స్టేషన్‌ పరిధిలోని ఓ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా హాల్లో కైఫ్‌, ఆరీఫ్‌ అనే ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

Students Fight in Hyderabad :ఆరీఫ్‌ అనే విద్యార్థి తనకు జవాబులు చూపించడంలేదంటూ.. కైఫ్‌ అనే విద్యార్థి అతని తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆరీఫ్‌. వెంటనే స్నేహితులు గాయపడిన ఆరీఫ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరీఫ్​పై దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ప్రస్తుతానికి సీసీ కెమెరాలోని దృశ్యాలు వైరల్‌గా మారాయి. బాధితుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details